- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికా సైనిక పరేడ్‌కు పాక్ ఆర్మీ చీఫ్.. వైట్ హౌస్ వివరణ ఇదే?
వాషింగ్టన్‌లో జరగనున్నసైనిక కవాతుకు పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను అతిథిగా ఆహ్వానించారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా సాయుధ దళాల 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వాషింగ్టన్‌లో జరగనున్న సైనిక కవాతుకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ (Asim muneer) ను అతిథిగా ఆహ్వానించారని ఇటీవల ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ కథనాలపై వైట్ హౌస్ స్పందించింది. యూఎస్ సైనిక కవాతుకు విదేశీ నాయకులెవరినీ ఇన్వైట్ చేయలేదని స్పష్టం చేసింది. ఈ కథనాలు పూర్తిగా అవాస్తవమని కొట్టి పారేసింది. విదేశీ సైనిక నాయకులెవరినీ కవాతుకు ఆహ్వానించలేదని తెలిపింది. అమెరికా సైనిక సామర్థ్యాలను ప్రదర్శించేందుకే ఈ పరేడ్ నిర్వహిస్తున్నామని పేర్కొంది.
అంతకుముందు అసీమ్ మునీర్‌ను ఆహ్వానించారనే కథనాలపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ స్పందిస్తూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఈ పరిణామం దౌత్య విధానాల్లో భారత్‌కు తీవ్రమైన ఎదురుదెబ్బ అని ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే వైట్ హౌస్ స్పందించి క్లారిటీ ఇచ్చింది. కాగా, అమెరికా సైన్యం 250 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కవాతు నిర్వహిస్తున్నారు. దీనిలో 6,600 మంది సైనికులు, 150 సైనిక వాహనాలు. హెలీకాప్టర్లు సహా ఇతర పరికరాలు విన్యాసాల్లో పాల్గొననున్నాయి.






