కాశ్మీర్‌లో 'వైట్-కాలర్ టెర్రర్' మాడ్యూల్ కేసు.. 8 చోట్ల ఎన్ఐఏ సోదాలు

by Malleboina Mahesh |

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన ఉగ్రవాద ఆత్మాహుతి దాడి సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

కాశ్మీర్‌లో వైట్-కాలర్ టెర్రర్ మాడ్యూల్ కేసు.. 8 చోట్ల ఎన్ఐఏ సోదాలు
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన ఉగ్రవాద ఆత్మాహుతి దాడి సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ 'వైట్-కాలర్' ఉగ్రవాద మాడ్యూల్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) సోమవారం కాశ్మీర్‌లోని ఎనిమిది ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. పుల్వామా, షోపియాన్, కుల్గాం జిల్లాలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈ మాడ్యూల్ ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు. అక్టోబర్‌లో పోలీసులు అరెస్టు చేసిన మౌల్వి ఇర్ఫాన్ అహ్మద్ వాగే నివాసంలో కూడా ఎన్ఐఏ బృందాలు సోదాలు నిర్వహించారు. ప్రారంభంలో బద్దలు కొట్టిన ఈ 'వైట్-కాలర్' ఉగ్రవాద మాడ్యూల్‌కు ఇతనే ముఖ్య సూత్రధారి అని దర్యాప్తులో తేలింది.

ఈ మాడ్యూల్ ప్రధానంగా యువతను రాడికలైజ్ చేయడం, రిక్రూట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ పేలుడులో 15 మంది మరణించారు, పలువురు గాయపడ్డారు. ఈ కేసు విచారణలో భాగంగా, అక్టోబర్‌లో అరెస్ట్ అయిన వాగేను ఎన్ఐఏ గత నెలలో తమ కస్టడీలోకి తీసుకుంది. ఈ దాడులు, దర్యాప్తు ద్వారా ఈ ఉగ్రవాద మాడ్యూల్‌కు సంబంధించిన పూర్తి నెట్‌వర్క్‌ను ఛేదించాలని ఎన్ఐఏ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా మెరుపు వేగంతో విచారణను కొనసాగిస్తుంది. ఈ విచారణకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం పూర్తి స్థాయిలో సహకరిస్తున్నాయి.

Next Story