ఉత్తరాదిన మూడో భాషగా ఏం నేర్పిస్తారు?

by Ajay Maddhiboyina |

జాతీయ విద్యా విధానం ముసుగులో కేంద్రం తమపై హిందీ భాషను బలవంతంగా రుద్దుతోందని ఆరోపించారు.

ఉత్తరాదిన మూడో భాషగా ఏం నేర్పిస్తారు?
X

- అక్కడ రెండే నేర్పిస్తుంటే.. తమిళనాడులో మూడెందుకు?

- మరోసారి కేంద్రంపై విరుచుకపడిన ఎంకే స్టాలిన్

దిశ, నేషనల్ బ్యూరో: నూతన విద్యా విధానం పేరుతో దక్షిణాదిన హిందీ భాషను రుద్దడంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కేంద్ర ప్రభుత్వం మధ్య వాగ్వివాదం కొనసాగుతూనే ఉంది. మూడు భాషల ఫార్ములాను తాను వ్యతిరేకిస్తున్నట్లు స్టాలిన్ మరోసారి ఉద్ఘాటించారు. ఈ మేరకు ఆయన సోమవారం 'ఎక్స' వేదికగా ఒక పోస్టు పెట్టారు. 'పక్షపాత విధానాలను సమర్థించే కొంత మంది తమిళనాడు విద్యార్థులు మూడో భాష నేర్చుకునే అవకాశాన్ని ఎందుకు నిరాకరిస్తున్నారంటూ అడుగుతున్నారు. అలాంటి వాళ్లు ఉత్తరాదిన మూడో భాషగా ఏం నేర్పిస్తున్నారో చెప్పరెందుకు? అక్కడ రెండు భాషలే నేర్పుతూ.. మనం మాత్రం మూడో భాషను ఎందుకు నేర్చుకోవాలి' అని స్టాలిన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. త్రిభాషా సూత్రం ప్రకారం ఉత్తరాదిన ఏ భాష నేర్పిస్తున్నారో చెప్పాలని కేంద్రాన్ని స్టాలిన్ డిమాండ్ చేశారు.కాగా, ఇదే అంశంపై డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా కేంద్రాన్ని నిలదీశారు. జాతీయ విద్యా విధానం ముసుగులో కేంద్రం తమపై హిందీ భాషను బలవంతంగా రుద్దుతోందని ఆరోపించారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ తమిళనాడులో జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయబోమని స్పష్టం చేశారు.

Next Story