Syria : సిరియాలో ఎన్నికలు ఎప్పుడో ప్రకటించిన ‘రెబల్స్’ నేత

by Hajipasha |

దిశ, నేషనల్ బ్యూరో : బషర్‌ అల్‌ అసద్‌ డిసెంబరు 8న దేశాధ్యక్ష పీఠాన్ని కోల్పోయి పరారైనప్పటి నుంచి సిరియా(Syria) దేశం రెబల్స్ దళాల పాలనలో ఉంది.

Syria : సిరియాలో ఎన్నికలు ఎప్పుడో ప్రకటించిన ‘రెబల్స్’ నేత
X

దిశ, నేషనల్ బ్యూరో : బషర్‌ అల్‌ అసద్‌ డిసెంబరు 8న దేశాధ్యక్ష పీఠాన్ని కోల్పోయి పరారైనప్పటి నుంచి సిరియా(Syria) దేశం రెబల్స్ దళాల పాలనలో ఉంది. ఈనేపథ్యంలో సిరియాలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దానిపై అంతటా చర్చ జరుగుతోంది. దీనిపై రెబల్స్ దళాలకు సారథ్యం వహిస్తున్న హయాత్ తహ్రీర్ అల్ షామ్ (హెచ్‌టీఎస్) గ్రూపు నేత అహ్మద్ అల్ షరా(Ahmed al Sharaa) కీలక ప్రకటన చేశారు.

సిరియాలో ఎన్నికల నిర్వహణకు దాదాపు నాలుగేళ్ల సమయం పట్టొచ్చన్నారు. సిరియా రాజ్యాంగ రూపకల్పనకు మూడేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. దేశంలో ప్రజాస్వామిక విధానాలను చూసేందుకు కనీసం ఇంకో ఏడాది సమయం పడుతుందన్నారు. దేశంలో ప్రజాస్వామిక వ్యవస్థ ఏర్పడిన తర్వాత హయాత్ తహ్రీర్ అల్ షామ్ గ్రూపు ఉండదని అల్ షరా స్పష్టం చేశారు.

Next Story