మాట్లాడేందుకు ఏం మిగిలి ఉంది.. మావోయిస్టులతో చర్చలపై అమిత్ షా

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-04 10:44:51  IST  )

మావోయిస్టులతో మాటల్లేవని.. ఆయుధాలు వదిలిపెట్టి లొంగిపోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మాట్లాడేందుకు ఏం మిగిలి ఉంది.. మావోయిస్టులతో చర్చలపై అమిత్ షా
X

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టులతో మాటల్లేవని.. ఆయుధాలు వదిలిపెట్టి లొంగిపోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) రాష్ట్రం బస్తర్ జిల్లా జగదల్‌పూర్‌లో ‘దసరా దర్బార్’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన శాంతి చర్చలపై మవోయిస్టు పార్టీ నుంచి వరుస లేఖలు వెలువడుతున్న నేపథ్యంలో ఆ విషయంపై స్పందించారు. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులను నిర్మూలిస్తామని అన్నారు. వారితో చర్చల ప్రసక్తే లేదని, బేషరుతుగా ఆయుధాలు వదిలి సరెండర్ అవ్వాలని వార్నింగ్ ఇచ్చారు. మాట్లాడేందుకు ఏం మిగిలి ఉందని.. చర్చలు లేఖలు రాస్తున్నారని ప్రశ్నించారు.

కేంద్రం, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం చర్చలు జరిపేందుకు సిద్ధంగా లేవని మరోసారి స్పష్టం చేశారు. లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసేందుకు మందుకొచ్చే వారికి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతామని, వారికి పునరావాసం కూడా కల్పిస్తామని అన్నారు. ఇప్పటికైనా మావోయిస్టులు ఆయుధాలు వదలకపోతే.. భద్రతా దళాలు వేటను ముమ్మరం చేస్తాయని హెచ్చరించారు. 2014-2024 మధ్య కాలంలో జరిగిన ఎన్‌కౌంటర్లలో భద్రతా సిబ్బంది మరణాలు 70 శాతం, పౌరుల మరణాలు 85 శాతానికి తగ్గాయని తెలిపారు. సుమారు 10,500 మంది మావోయిస్టులు లొంగిపోయారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు.

Next Story