Disaster : ఇది ఏ ఉపద్రవానికి సంకేతం?

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-21 12:40:50  IST  )

ముంచుకొచ్చే ప్రకృతి వైపరీత్యాల(Disasters)ను కొన్ని జంతువుల ప్రవర్తన(Behavior Of Some Animals) ఆధారంగా ముందే పసిగట్టవచ్చని(Advance Identified) పూర్వికులు...నిపుణులు నివేదించారు

Disaster : ఇది ఏ ఉపద్రవానికి సంకేతం?
X

దిశ, వెబ్ డెస్క్ : ముంచుకొచ్చే ప్రకృతి వైపరీత్యాల(Disasters)ను కొన్ని జంతువుల ప్రవర్తన(Behavior Of Some Animals) ఆధారంగా ముందే పసిగట్టవచ్చని(Advance Identified) పూర్వికులు...నిపుణులు నివేదించారు. ముఖ్యంగా సునామీలు, భూకంపాల రాకను జంతువులు ముందే పసిగడుతాయని గతంలో చాలసార్లు రుజువైంది. ప్రకృతి వైపరిత్యాల ముందు కొన్ని జంతువులు తమ వింత ప్రవర్తనతో మనుషులకు కూడా విపత్తుల రాక సంకేతాలను అందిస్తుంటాయంటారు.

2004లో ఇండోనేషియాలో 9.1 తీవ్రతతో సముద్రగర్భంలో సంభవించిన భూకంపం కారణంగా సంభవించిన సునామీ హిందూ మహాసముద్రం చుట్టూ ఉన్న తీరప్రాంత దేశాలను ముంచెత్తి కనీసం 225,000 మందిని బలిగొంది. ప్రత్యక్ష సాక్షుల కథనాల మేరకు సునామీని ముందే పసిగట్టిన ఏనుగులు ఎత్తైన ప్రాంతాలకు పరిగెత్తాయని, ఫ్లెమింగోలు లోతట్టు ప్రాంతాలలో గూడు కట్టుకున్న ప్రాంతాలను విడిచిపెట్టాయని..కుక్కలు బయటికి వెళ్లలేదని.. గేదేలు, ఆవులు, మేకలు, పిల్లులు బీచ్ లకు దూరంగా కొండలపైకి వెళ్లాయని స్థానికులు నివేదించారు. గతంలో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ విపత్తు ప్రమాద వ్యూహం (UNISDR) సలహా బృందం సభ్యురాలు ఇరినా రాఫ్లియానా కూడా ఈ కథనాలను దృవీకరించారు.

ఇది ఇలా ఉంటే..సముద్రంలో అరుదుగా కనిపించే మెరుస్తు ఉండే ఓర్ఫిష్ చేప ('Doomsday Fish') మెక్సికోలో ఒడ్డుకు కొట్టుకొచ్చి అక్కడికి వచ్చిన వారిని ఆశ్చర్య పరిచింది. ఓర్ఫిష్ జాతి చేపలు సాధారణంగా సముద్రంలో 60 నుంచి 3200 అడుగుల లోతులో జీవిస్తుంటాయి. తీరం వద్ధ కనిపించడం చాలా అరుదు. 'డూమ్స్ డే ఫిష్' అని పిలిచే ఈ జీవి ఏదైనా విపత్తు సంభవించే ముందు మాత్రమే సముద్రం లోపలి నుంచి ఉపరితలంపైకి(inside the ocean to the surface)కొట్టుకొస్తుందని తీర ప్రాంత ప్రజల నమ్మకం. ఈ నేపథ్యంలో సముద్రం అడుగు భాగం ఆవాసం వదిలి ఓర్ఫిష్ చేప ఇప్పుడు తీరానికి చేరడం రాబోయే ఏ విపత్తుకు సంకేతమన్న చర్చ తీర ప్రాంత ప్రజలను కలవరపెడుతోంది.

మెక్సికోలోని బాజా కాలిఫోర్నియా సుర్‌లోని ప్లేయా ఎల్ క్వెమాడో బీచ్‌లో తీరానికి వచ్చిన 'డూమ్స్ డే ఫిష్' ను " గమనించిన రాబర్ట్ హేస్ దానిని మూడుసార్లు నీటిలోకి దారి మళ్లించారు కానీ అది ప్రతిసారీ తిరిగి వచ్చిందని అతను తెలిపాడు. జపానీస్ జానపద కథల్లో ప్రజలు ఈ చేపను ఆశుభ సంకేతంగా..ముంచుకొచ్చే విపత్తును తెలిపే సముద్ర దేవుడి దూతగా భావిస్తారు. 2011 టోహోకు భూకంపం, సునామీ సంభవించడానికి ముందు 2009, అలాగే 2010లో జపాన్‌లోని చాలా మంది తమ దేశ బీచ్‌లలో 20 ఓర్ ఫిష్‌లను చూసినట్లు గుర్తు చేసుకున్నారు, ఈ భూకంపం 20,000 మందికి పైగా ప్రజలను బలిగొంది.

Next Story