గూండాల కోసం ఏ భాష వాడమంటారు: టీఎంసీకి సీఎం హిమంత స్ట్రాంగ్ కౌంటర్

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-25 09:04:17  IST  )

అధికార టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యలపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ తీవ్రంగా స్పందించారు.

గూండాల కోసం ఏ భాష వాడమంటారు: టీఎంసీకి సీఎం హిమంత స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్‌‌డెస్క్: పశ్చిమ బెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ, టీఎంసీల నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతూనే ఉంది. కేంద్ర మంత్రి అమిత్ షాకు అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee) విసిరిన సవాల్‌పై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ (Himanta Biswa Sarma) తనదైన శైలిలో స్పందించారు. అభిషేక్ జీ అమిత్ షాకు సవాల్ విసరాల్సిన అవసరం లేదన్నారు. ఫలితాలు మే 4న వస్తాయని.. సరిగ్గా 6వ తేదీన అభిషేక్ దుబాయ్ వెళ్లడం పక్కా అని ఎద్దేవా చేశారు.

అదేవిధంగా అమిత్ షా వినియోగిస్తున్న భాషపై టీఎంసీ విమర్శలకు హిమంత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గుండాల కోసం ఎలాంటి భాష వాడాలని ప్రశ్నించారు. అమిత్ షా గుండాలను ఉరితీస్తామని చెబుతున్నారు. మీరు గుండాలను ప్రేమించాలనుకుంటున్నారా..! అంటూ సెటైర్లు వేశారు. మమతా దీదీ గుండాల పట్ల ప్రేమపూర్వక భాష వాడుతారమో, కానీ మేము అలా చేయబోమని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బెంగాల్‌లో మార్పు రావాలని, అవినీతి, గుండాగిరీకి స్వస్తి పలికి ‘సోనార్ బంగ్లా’ నిర్మించాలంటే బీజేపీకే ఓటు వేయాలని సీఎం హిమంత బిస్వా శర్మ పిలుపునిచ్చారు.

Next Story