- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎంగా విజయ్.. మరి త్రిష సంగతేంటి?
అనేక నాటకీయ పరిణామాల తరవాత తమిళనాడులో విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. తొమ్మిదిమంది మంత్రులతో కలిసి విజయ్ కేబినెట్ కొలువుదీరింది. విజయ్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి అతడి తల్లిదండ్రులతో పాటు త్రిష కూడా హాజరయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: అనేక నాటకీయ పరిణామాల తరవాత తమిళనాడులో విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. తొమ్మిదిమంది మంత్రులతో కలిసి విజయ్ కేబినెట్ కొలువుదీరింది. విజయ్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి అతడి తల్లిదండ్రులతో పాటు త్రిష కూడా హాజరయ్యారు. త్రిష ఈ కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అయితే తమిళనాడులో ఎన్నికలు జరగముందు నుండే విజయ్ పార్టీలోకి త్రిష కూడా వెళతారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కొంతకాలంగా రిలేషన్ షిప్ లో ఉన్నారని త్రిష కచ్చితంగా విజయ్ పార్టీలో చేరతారని వార్తలు వచ్చాయి. కానీ అలా జరగలేదు.
ఎన్నికల తరవాత విజయ్ పార్టీకి మెజార్టీ స్థానాలు రావడంతో పాటు విజయ్ రెండు చోట్ల పోటీ చేయగా రెండు నియోజకవర్గాల నుండి విజయం సాధించారు. దీంతో ఒక సీటుకు విజయ్ రాజీనామా చేసి త్రిషను బరిలోకి దింపుతాడనే ప్రచారం మొదలైంది. కానీ ఇప్పుడు ఆ టికెట్ పొత్తులో భాగమైన ఓ పార్టీ అడిగినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా విజయ్ సీఎం అయ్యాడు త్రిష పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు మొదలవుతున్నాయి. విజయ్ త్రిష ఇద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని ప్రపంచం కోడై కూస్తోంది.
ఆ ప్రచారానికి తగినట్టే త్రిష గెలిచిన వెంటనే విజయ్ ఇంటికి వెళ్లడం, తరవాత ప్రమాణస్వీకారోత్సవానికి హాజరవ్వడం జరిగింది. దీంతో విజయ్ త్రిష పెళ్లి చేసుకుంటారా అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు విజయ్ త్రిషను రాజకీయాల్లోకి రానివ్వడని పెళ్లి చేసుకుంటాడని కానీ రాజకీయాలకు దూరంగా ఉంచుతాడనే ప్రచారం కూడా జోరుగా వినిపిస్తోంది. మరోవైపు వీరిద్దరు పెళ్లి చేసుకోరు కానీ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఎంజేఆర్, జయలలిత మాదిరిగా ఉంటారనే టాక్ ఉంది. చూడాలి మరి ముందు ముందు ఏం జరుగుతుందో.






