- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
1968 సివిల్ డిఫెన్స్ చట్టంలోని రూల్ 11 ఏంటి?
1968 సివిల్ డిఫెన్స్ చట్టంలోని రూల్ 11, ది సివిల్ డిఫెన్స్ రూల్స్, 1968లో భాగంగా ఉంది. ఈ రూల్ "పవర్ టు రిక్వైర్ లోకల్ అథారిటీస్ టు టేక్ ప్రికాషనరీ మెజర్స్" అనే పేరుతో ఉంది.

దిశ, వెబ్‌డెస్క్: భారత్ - పాక్ సరిహద్దుల్లో పరిస్థితి ముదురుతోంది. ఇప్పటికే ఇరుదేశాల మధ్య యుద్ధం ప్రారంభమవ్వగా.. పాక్ పదే పదే డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. ఇండియన్ ఆర్మీ గగనతలంలోనే వాటిని కూల్చివేస్తోంది. యుద్ధం నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు లేఖ రాసింది. 1968 సివిల్ డిఫెన్స్ చట్టంలోని రూల్ 11 ఉపయోగించి అవసరమైతే అత్యవసర పరికరాలను కొనుగోలు చేసేందుకు సీఎస్ లకు అధికారమిస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొంది. 1968 సివిల్ డిఫెన్స్ చట్టంలోని రూల్ 11లో ఏం ఉంది?
1968 సివిల్ డిఫెన్స్ చట్టంలోని రూల్ 11, ది సివిల్ డిఫెన్స్ రూల్స్, 1968లో భాగంగా ఉంది. ఈ రూల్ "పవర్ టు రిక్వైర్ లోకల్ అథారిటీస్ టు టేక్ ప్రికాషనరీ మెజర్స్" అనే పేరుతో ఉంది. దీని ప్రకారం.. శత్రు దాడి లేదా యుద్ధ సమయంలో.. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక అధికారులను అవసరమైన జాగ్రత్త చర్యలు తీసుకోమని హోంశాఖ ఆదేశించవచ్చు. 1968 సివిల్ డిఫెన్స్ నియమాలలోని సెక్షన్ 11 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. ఇవి ప్రజలను రక్షించడానికి, ఆస్తులను కాపాడటానికి, యుద్ధం లాంటి పరిస్థితిలో విద్యుత్, నీరు, రవాణా వంటి ముఖ్యమైన సేవలు కొనసాగేలా చూసుకోవడానికి రాష్ట్రం త్వరిత చర్యలు తీసుకోవడానికి అనుమతిస్తాయి. భారతదేశంలోని ప్రజలు, ఆస్తులు, ప్రదేశాలను శత్రు దాడులు లేదా విపత్తుల నుండి రక్షించడానికి తీసుకున్న చర్యలను, ప్రధాన ఓడరేవుల రక్షణ వంటివాటిపై నిర్ణయం తీసుకునే అధికారాలు ఉంటాయి.
సైరన్లు, ఇతర అత్యవసర పరికరాలను కొనుగోలు చేసే అధికారం రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల సివిల్ డిఫెన్స్ డైరెక్టర్‌కు ఇవ్వొచ్చు. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. ఈ రూల్‌ను ఉపయోగించుకోవాలని కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు లేఖలు రాసింది. ఈ రూల్ యుద్ధం లేదా శత్రు దాడి సమయంలో ప్రభుత్వానికి వేగవంతమైన చర్యలు తీసుకునే అధికారాన్ని ఇస్తుంది.






