Nation Wide Mock Drill : మాక్ డ్రిల్‌లో ఏం చేస్తారు? దీనివల్ల మనకేంటి ఉపయోగం?

by Naga Rani Yarlagadda |

భారత్ - పాక్ ల మధ్య యుద్ధం అనివార్యమైతే.. వైమానిక దాడుల ముప్పు ఉన్నప్పుడు పెద్ద శబ్దంతో కూడిన సైరన్లను మోగిస్తారు. ఆ సమయంలో ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు, బంకర్లకు లేదా ఇతర సేఫ్ ప్రదేశాలకు తరలి వెళ్లాల్సి ఉంటుంది.

Nation Wide Mock Drill : మాక్ డ్రిల్‌లో ఏం చేస్తారు? దీనివల్ల మనకేంటి ఉపయోగం?
X

దిశ, వెబ్‌డెస్క్: మే7న దేశంలోని 244 జిల్లాల్లో మాక్ డ్రిల్ (Mock Drill) నిర్వహించాలని కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. పాకిస్థాన్ తో యుద్ధం (IND Pak War) జరగనున్న నేపథ్యంలోనే కేంద్రం ఈ చర్యలు తీసుకుంటోందని ఇప్పటికే కేంద్ర సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. 1971లో భారత్ - పాకిస్థాన్ యుద్ధం (1971 India Pak War) సమయంలో ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించింది అప్పటి భారత ప్రభుత్వం. మళ్లీ 54 సంవత్సరాల తర్వాత సివిల్ డిఫెన్స్ (Civil Defence) మాక్ డ్రిల్స్ నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు? అసలు మాక్ డ్రిల్స్ అంటే ఏం చేస్తారు?

భారత్ - పాక్ ల మధ్య యుద్ధం అనివార్యమైతే.. వైమానిక దాడుల ముప్పు ఉన్నప్పుడు పెద్ద శబ్దంతో కూడిన సైరన్లను మోగిస్తారు. ఆ సమయంలో ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు, బంకర్లకు లేదా ఇతర సేఫ్ ప్రదేశాలకు తరలి వెళ్లాల్సి ఉంటుంది. లైట్లను ఆపి శత్రు విమానాలకు గమ్యం కాకుండా చూడాలి. సివిలియన్ అండ్ స్టూడెంట్స్ కు యుద్ధ సమయంలో ఏం చేయాలన్న విషయాలపై మాక్ డ్రిల్స్ లో ట్రైనింగ్ ఇస్తారు. స్కూళ్లు, కాలనీలు, కార్యాలయాల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అత్యవసర సమయంలో ఎలా స్పందించాలి? సురక్షిత ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి? స్నేహితులు, కుటుంబాలను ఎలా రక్షించుకోవాలి? వాళ్లను ఎలా చేరుకోవాలి? ప్రభుత్వ కార్యాలయాలు, పవర్ ప్లాంట్లు, కమ్యూనికేషన్ టవర్లు, ప్రాముఖ్యమైన ప్రదేశాలను కవర్ చేయడం, ఇవాక్యుయేషన్ ప్లాన్ అప్డేట్స్ అండ్ రిహార్సల్స్, దాడి సమయంలో ఎటువైపు వెళ్లాలన్న విషయాలపై మాక్ డ్రిల్స్ లో అవగాహన కల్పిస్తారు.

పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ కంటోన్మెంట్‌లో మే 4న 30 నిమిషాల బ్లాక్‌అవుట్ డ్రిల్ జరిగింది. ఇది రేపు దేశవ్యాప్తంగా జరిగే కవాతుకు ఒక సంకేతం. ఈ డ్రిల్స్‌లో సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, హోం గార్డ్స్, NCC, NSS, NYKS సభ్యులు, విద్యార్థులు, స్థానిక అధికారులు పాల్గొంటారు. ఈ కవాతు భారతదేశం యొక్క రక్షణ విధానంలో పౌర సన్నద్ధతను చేర్చే ఒక వ్యూహాత్మక మార్పును సూచిస్తుంది. ఈ డ్రిల్స్ వల్ల పౌరులు భయపడాల్సిన అవసరం లేదని, యుద్ధం వస్తే ఎలా ఎదుర్కోవాలో అందరికీ అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతోనే నిర్వహిస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు. ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో, తెలంగాణలోని హైదరాబాద్ లో మాక్ డ్రిల్స్ జరగనున్నాయి. కశ్మీర్, గుజరాత్, హరియాణా, అస్సాం రాష్ట్రాల్లోని జిల్లాల్లో ఎక్కువ మాక్ డ్రిల్స్ జరగనున్నాయి. మీకు దగ్గరగా మాక్ డ్రిల్ జరుగుతుంటే మనకెందుకులే అని అనుకోకుండా అందులో పాల్గొనండి. ఇది రేపటి మన భవిష్యత్తుకోసం ఉపయోగపడుతుంది.

Next Story