- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కదులుతున్న రైలు నుంచి జారిపడ్డ మహిళ.. తర్వాత ఏమైందంటే!?
రైలు ఎక్కెటప్పుడైన, దిగేముందైన చాలా జాగ్రత్తగా ఉండాలని రైల్వే అధికారులు చెబుతున్న కొందరు ప్రయాణికులు మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు.

దిశ,వెబ్‌డెస్క్: రైలు ఎక్కెటప్పుడైన, దిగేముందైన చాలా జాగ్రత్తగా ఉండాలని రైల్వే అధికారులు చెబుతున్న కొందరు ప్రయాణికులు మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదాల బారిన కూడా పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. రైలు దిగుతుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోయిన మహిళ.. రైల్వే సిబ్బంది అప్రమత్తతతో ప్రాణాపాయం నుంచి బయటపడింది.
వివరాల్లోకి వెళితే.. ముంబై(Mumbai)లోని బోరివలి రైల్వే స్టేషన్‌లో ఓ మహిళా ప్రయాణికురాలు ట్రైన్ దిగుతుండగా జారి పడింది. అయితే ఆమె కదులుతున్న రైలు నుంచి దిగే ప్రయత్నంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టాలపై పడబోతున్న మహిళను.. అదే సమయంలో అటుగా వెళుతున్న రైల్వే పోలీస్ ఒకరు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది.
రైలు(train) నుంచి పట్టాలపై పడబోతున్న మహిళను రైల్వే పోలీసు వేగంగా వెనక్కి లాగడంతో సురక్షితంగా బయటపడింది. రైల్వే స్టేషన్ లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన ఫుటేజీని సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ చేయగా ఆ వీడియో(Video) వైరల్(Viral)గా మారింది. ఈ క్రమంలో ట్రైన్ కదులుతుండగా ఎక్కడం, దిగడం చేయొద్దంటూ ప్రయాణికులకు రైల్వే శాఖ(railway Department) విజ్ఞప్తి చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు రైల్వే పోలీస్ అధికారిని ప్రశంసిస్తున్నారు. ఆయన అప్రమత్త వల్లే మహిళ ప్రాణాలు దక్కాయని కామెంట్లు పెడుతున్నారు.






