Air India Crash: పైలట్లను బ్లేమ్ చేస్తున్న పాశ్చాత్య మీడియా..బోయింగ్‌ను కాపాడేందుకేనా?

by Phanindra |

ఎయిరిండియా ప్రమాదానికి పైలట్లను బ్లేమ్ చేస్తూ పాశ్చాత్య మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇదంతా బోయింగ్‌ను కాపాడేందుకేనా?

Air India Crash: పైలట్లను బ్లేమ్ చేస్తున్న పాశ్చాత్య మీడియా..బోయింగ్‌ను కాపాడేందుకేనా?
X

దిశ, నేషనల్ బ్యూరో: అహ్మదాబాద్‌లో జరిగిన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) ఇచ్చిన రిపోర్టులో పైలట్ల సంభాషణ, ఫ్యూయల్ స్విచ్‌ ఆగిపోవడం తదితర అంశాలు వెలువడ్డాయి. ఇక ఇదే కారణంగా పట్టుకున్న పాశ్చాత్య మీడియా.. విమానంలో ఉన్న సమస్యలు, ఇతర అంశాలన్నింటినీ పక్కన పెట్టేసి పైలట్ల తప్పిదం వల్లనే ఎయిరిండియా ప్రమాదం జరిగిందంటూ కథనాలు అల్లుతోంది. ఈ విమానాల్లో ఉండే ఫ్యూయల్ స్విచ్ వ్యవస్థపై యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) ఇచ్చిన రిపోర్టులో హెచ్చరికలు చేసినా.. బోయింగ్ విమానాల్లో ఎలాంటి సమస్యలు లేవంటూ బీబీసీ, రాయిటర్స్, గార్డియన్, డైలీ మెయిల్, ది టెలిగ్రాఫ్ వంటి బడా సంస్థలు కూడా వార్తలు రాసేస్తున్నాయి. విమానం గాల్లోకి లేచిన సెకన్ల వ్యవధిలోనే రెండు ఇంజిన్లు ఆగిపోయాయని ఏఏఐబీ రిపోర్టులో పేర్కొంది.

బోయింగ్‌ను కాపాడేందుకేనా?

బోయింగ్ అనేది చాలా పెద్ద కంపెనీ. పాశ్చాత్య దేశాల్లో అమెరికా సహా పలుదేశాలు ఈ సంస్థతో ఒప్పందాలు చేసుకొని ఉన్నాయి. అందుకే ఈ కంపెనీకి చెడ్డపేరు రాకుండా తప్పించేందుకే బడా బడా వార్తా సంస్థలన్నీ కదులుతున్నట్లు కనిపిస్తోంది. 242 మంది చనిపోయిన ప్రమాదానికి ఇద్దరు పైలట్లను కారణంగా చూపిస్తే.. ఆ కంపెనీకి ఎలాంటి చెడ్డపేరు రాదు. ఆ పైలట్లు కూడా ప్రమాదంలో మరణించారు కాబట్టి వాళ్లు తమను తాము కనీసం డిఫెండ్ కూడా చేసుకోలేరు. అసలు విమానంలో ఏం జరిగిందని ఎవరూ కచ్చితంగా చెప్పలేని సమయంలో పైలట్లపై భారాన్ని వేసేయాలని వెస్టర్న్ మీడియా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

Next Story