West Bengal: బంగ్లాదేశ్ దిగుమతులపై ఆంక్షలు.. పశ్చిమ బెంగాల్‌పై తీవ్ర ప్రభావం !

by B.Srinivas |

బంగ్లాదేశ్ నుంచి పోర్టుల ద్వారా పలు వస్తువుల దిగుమతులపై భారత్ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

West Bengal: బంగ్లాదేశ్ దిగుమతులపై ఆంక్షలు.. పశ్చిమ బెంగాల్‌పై తీవ్ర ప్రభావం !
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్ నుంచి పోర్టుల ద్వారా పలు వస్తువుల దిగుమతులపై భారత్ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయంతో పశ్చిమ బెంగాల్ (West Bengal) పై తీవ్ర ప్రభావం పడనున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఉపాధి, రవాణా ఆదాయంపై ఇంపాక్ట్ చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. సరిహద్దు రవాణా హబ్‌లలో పని చేసే కార్మికులు పోర్ట్ పరిమితుల ద్వారా నష్టపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. వీరంతా తమ ఉపాధిని కోల్పేయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఎందుకంటే ఓడరేవుల ద్వారా వచ్చిన వస్తువులను వీరు ఇతsర ప్రాంతాలకు చేరవేసేవారు. దీంతో తాజా డిసిషన్ వీరిపై ఎక్కువ ప్రభావం పడనుంది.

జాతీయ ప్రయోజనాలే కీలకం

పశ్చిమ బెంగాల్ పై ప్రభావం పడినప్పటికీ జాతీయ ప్రయోజనాల దృష్యా ఈ నిర్ణయం సరైందేనని నిపుణులు చెబుతున్నారు. ‘కేంద్రం తీసుకున్న ఈ చర్య వ్యూహాత్మకమైనది కావచ్చు. బంగ్లాదేశ్ తో కొనసాగుతున్న ఇటీవల భౌగోళిక రాజకీయ పరిణామాలను అనుసంధానించబడి ఉండొచ్చు. బెంగాల్ పై ప్రభావం పడే చాన్స్ ఉంది. కానీ ఆర్థిక పరిణామాల కంటే జాతీయ ప్రయోజనాలే ముఖ్యం’ అని ఓ నిపుణుడు తెలిపారు. కాగా, బంగ్లాదేశ్ నుంచి వచ్చే రెడీమేడ్ దుస్తులు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు సహా పలు వస్తువుల దిగుమతులపై పోర్ట్ ఆంక్షలు విధించింది. ఇప్పుడు కేవలం వీటిని నవా షెవా ఓడరేవు, కోల్ కతా పోర్ట్ ల ద్వారా మాత్రమే అనుమతించనున్నారు.

Next Story