West bengal: బెంగాల్‌లో మహాకూటమి.. టీఎంసీని గద్దె దించేందుకు బీజేపీ ప్లాన్

by B.Srinivas |   (  Updated:2025-07-06 14:41:21  IST  )

పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ని గద్దె దించేందుకు బీజేపీ కీలక ప్రతిపాదన చేసింది.

West bengal: బెంగాల్‌లో మహాకూటమి.. టీఎంసీని గద్దె దించేందుకు బీజేపీ ప్లాన్
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ని గద్దె దించేందుకు బీజేపీ కీలక ప్రతిపాదన చేసింది. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ విభేదాలను పక్కనపెట్టి టీఎంసీని ఓడించేందుకు మహా కూటమిని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్, సీపీఎంలను కోరింది. శ్యామ్ ప్రసాద్ జయంతి సందర్భంగా కోల్ కతాలో జరిగిన కార్యక్రమంలో వెస్ట్ బెంగాల్ బీజేపీ చీఫ్ సమిక్ భట్టాచార్య (Samik battacharya) మాట్లాడుతూ ఈ అంశాన్ని లేవనెత్తారు. బెంగాల్‌లో జరుగుతున్న మతోన్మాదానికి వ్యతిరేకంగా సమిష్టి రాజకీయ కృషి అవసరమని తెలిపారు. ‘బంగ్లాదేశ్‌లోని ఇందిరా గాంధీ లైబ్రరీలో 70,000 పుస్తకాలు కాలిపోయాయి. ముర్షిదాబాద్‌లో ఒక ఉపాధ్యాయుడిపై ఆయన శిష్యులే దాడి చేశారు. మతోన్మదానిని ఇవే ఉదాహరణలు’ అని వ్యాఖ్యానించారు. ఒక్క పార్టీతో మతోన్మాదం నుంచి విముక్తి పొందలేమని తెలిపారు. అన్ని పొలిటికల్ పార్టీలు ముందుకు రావాలని కోరారు. జ్యోతి బసును గౌరవిస్తే ఆయన నిర్మించిన బెంగాల్‌ను కాపాడటానికి ముందుకు రావాలని సూచించారు.

ఈ ప్రతిపాదనపై కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి (Adhir Ranjan Chowdary) స్పందించారు. భారతదేశ మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా అందరూ ఐక్యంగా ఉండాలని కాంగ్రెస్ చేస్తు్న్నది అదేనని తెలిపారు. అందరూ ఐక్యంగా ఉండి బీజేపీని తరిమికొట్టాలన్నారు. సీపీఎం నేత శతరూప్ ఘోష్ భట్టాచార్య విజ్ఞప్తిని తోసిపుచ్చారు. బీజేపీ అనాగరికుల పార్టీ అని ఆ పార్టీకి నాగరిక సమాజంలో స్థానం ఉండకూడదని తెలిపారు. జ్యోతి బసు మార్గంలో మనం బెంగాల్‌ను కాపాడుకోవాలంటే, ఆయన చూపిన మతతత్వేతర బెంగాల్‌ను కాపాడుకోవాలన్నారు.

Next Story