- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bengal Governor: బెంగాల్ గవర్నర్ కు ఛాతినొప్పి.. ఆస్పత్రిలో చేరిక
పశ్చిమబెంగాల్ (West Begal) గవర్నర్ (Governor) సీవీ ఆనందబోస్ (CV Anandabose) ఆస్పత్రిలో చేరారు. ఛాతి నొప్పితో ఆస్పత్రితో ఆస్పత్రిలో చేరినట్లు రాజ్ భవన్ అధికారులు తెలిపారు.

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమబెంగాల్ (West Begal) గవర్నర్ (Governor) సీవీ ఆనందబోస్ (CV Anandabose) ఆస్పత్రిలో చేరారు. ఛాతి నొప్పితో ఆస్పత్రితో ఆస్పత్రిలో చేరినట్లు రాజ్ భవన్ అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆయనను హుటాహుటిన కోల్‌కతా (Kolkata) లోని కమాండ్ ఆస్పత్రి (Command hospital) కి తరలించారు. గవర్నర్‌కు ప్రాథమిక పరీక్షలు చేశామని, ఆయన గుండెలో బ్లాకేజ్ ఉన్నట్లు గుర్తించామని కమాండ్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మరోవైపు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఆస్పత్రికి వెళ్లి గవర్నర్‌ను కలిశారు. సీవీ ఆనంద బోస్ ని కలిసి ఆస్పత్రి బయటికి వచ్చిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. తాను గవర్నర్‌ను పరామర్శించినట్లు పేర్కొన్నారు. ఆయనకు మెరుగైన చికిత్స అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ ఆదేశించానని చెప్పారు. మెరుగైన చికిత్స కోసం ఆయనను కమాండ్ ఆస్పత్రి నుంచి అపోలో ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు.






