పశ్చిమ బెంగాల్ ఎన్నికలు.. ఐదుగురు పోలీస్ అధికారులపై ఈసీ వేటు

by Kema Shiva Kumar |

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఐదుగురు పోలీసు అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది.

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు.. ఐదుగురు పోలీస్ అధికారులపై ఈసీ వేటు
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల విధులను సక్రమంగా నిర్వహించనందు, నిష్పాక్షికతను పాటించడంలో విఫలమైనందుకు గాను కేంద్ర ఎన్నికల సంఘం డైమండ్ హార్బర్ (Diamond Harbour) ప్రాంతానికి చెందిన ఐదుగురు పోలీసు అధికారులను తక్షణమే సస్పెండ్ చేసింది. వారిపై క్రమశిక్షణా చర్యలను కూడా ప్రారంభించాలని ఈసీ ఆదేశించింది. సస్పెన్షన్‌కు గురైన అధికారుల్లో అడిషనల్ ఎస్పీ సందీప్ గరాయ్, ఎస్డీపీవో సజల్ మోండల్, ఇన్‌స్పెక్టర్ ఇంచార్జ్, డైమండ్ హార్బర్ పోలీస్ స్టేషన్ మౌసమ్ చక్రవర్తి, ఇన్‌స్పెక్టర్ ఇంచార్జ్ ఫాల్టా పోలీస్ స్టేషన్ అజయ్ బాగ్, ఆఫీసర్ ఇంచార్జ్, ఉస్థి పోలీస్ స్టేషన్ శుభేచ్ఛ బాగ్‌లు ఉన్నారు.

సీఈసీ మాస్ వార్నింగ్..

ఎన్నికల సమయంలో అధికారులు ఎలాంటి రాజకీయ పక్షపాతం చూపకుండా, నిష్పాక్షికంగా వ్యవహరించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. అయితే ఈ అధికారులు నిబంధనలను ఉల్లంఘించినట్లుగా ఆధారాలు లభించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రక్రియలో విఘాతం కలిగించేలా ప్రవర్తించే ఏ అధికారిపైనైనా కఠిన చర్యలు తప్పవని కేంద్ర ఎన్నికల సంఘం వార్నింగ్ ఇచ్చింది.

Next Story