Weather Update : ఐదు రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్

by Hajipasha |

దిశ, నేషనల్ బ్యూరో : దేశంలోని పలు రాష్ట్రాలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) రెడ్ అలర్ట్ జారీ చేసింది.

Weather Update : ఐదు రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో : దేశంలోని పలు రాష్ట్రాలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న రెండు రోజుల్లో పశ్చిమ మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, గుజరాత్, కొంకణ్ రీజియన్(మహారాష్ట్ర), గోవా, సెంట్రల్‌లలో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అంచనా వేసింది. ఆయా రాష్ట్రాల్లో రుతుపవనాలు క్రియాశీలక దశలో ఉన్నాయని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో ఈశాన్య మధ్యప్రదేశ్ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

రాబోయే కొన్నిరోజుల పాటు కేరళ, కోస్టల్ కర్ణాటక, తమిళనాడులలో భారీ వర్షాలు ఉంటాయని అంచనా వేసింది. ఇందుకు భిన్నంగా ఢిల్లీ - ఎన్‌సీఆర్ ప్రాంతంలో వచ్చే రెండు రోజుల పాటు ఎలాంటి వర్షాలు కురవవని వెల్లడించింది.

Next Story