- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహాత్ముడి మార్గాన్ని అనుసరిస్తూనే ఉంటాం.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ (Mahatma Gandhi)కి ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) నివాళులర్పించారు.

దిశ, వెబ్‌డెస్క్: గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ (Mahatma Gandhi)కి ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) నివాళులర్పించారు. ఇవాళ ఉదయం ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌కు వెళ్లి గాంధీజీ స్మారకం వద్ద పూష్పగుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు. అయితే, అంతకు ముందు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా దేశ స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీ చేసిన కృషిని కొనియాడుతూ ట్వీట్ చేశారు. మన ప్రియమైన బాపూ అసాధారణ జీవితం, ఆదర్శాలు మానవ చరిత్ర గమనాన్ని మార్చాయని అన్నారు. ధైర్యం, నిరాడంబరతతో మార్పును సాధించుకోవచ్చని ఆయన నిరూపించారని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయడం, ఇతరులపై కరుణతో ఉండటమే మన సాధికారికతకు శక్తిమంతమైన సాధనాలు అని విశ్వసించి వ్యక్తి గాంధీజీ (Gandhiji) అని అన్నారు. వికసిత్ భారత్‌ను నిర్మించడం కోసం మేం ఆయన మార్గాన్ని అనుసరిస్తూనే ఉంటామని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.






