- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation Kagar : ఆపరేషన్ కగార్‌పై అమిత్ షా సంచలన ప్రకటన
ఆపరేషన్ కగార్(Operation Kagar)పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amith Sha) మరో కీలక ప్రకటన చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : ఆపరేషన్ కగార్(Operation Kagar)పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amith Sha) మరో కీలక ప్రకటన చేశారు. రానున్న వర్షాకాలంలోనూ మావోయిస్టుల(Maoists) ఏరివేత ఆపరేషన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. రెండు రోజుల పర్యటన కోసం నేడు ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) చేరుకున్న అమిత్ షా.. రాయపూర్ అటల్ నగర్లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2026 నాటికి మావోయిస్ట్ ముక్త్ భారత్ ను సాధించే దిశగా ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. ప్రతి వర్షాకాలం పరిస్థితిని అనుకూలంగా తీసుకొని మావోయిస్టులు రెస్ట్ తీసుకునేవారని, ఈసారి మాత్రం వారిని నిద్రపోనివ్వమని అన్నారు.
వారితో ఎలాంటి చర్చలు చేపట్టబోమని స్పష్టం చేసిన అమిత్ షా.. వారే ఆయుధాలు వీడి రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. జనజీవన స్రవంతిలో చేరే వారికి మరింత సాయం చేస్తామని తెలియజేశారు. కాగా నక్సలిజం సమస్యపై ఈరోజు సాయంత్రం ఛత్తీస్‌గఢ్, ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఒడిషా, మహారాష్ట్ర, జార్ఖండ్ ఉన్నతాధికారులతో అమిత షా కీలక సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్టు సమాచారం.






