- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kannada Tamil language dispute: కమల్ హాసన్ 'థగ్ లైఫ్' సినిమా విడుదల అడ్డుకుంటాం.. కన్నడ సంఘాలు
తమిళ సినీ నటుడు కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ (thug life) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలపై కన్నడ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కమల్ నటించిన తాజా చిత్రం థగ్ లైఫ్ విడుదలను నిలిపివేయాలని హెచ్చరిస్తున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: తమిళ సినీ నటుడు కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ (thug life) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలపై కన్నడ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కమల్ నటించిన తాజా చిత్రం థగ్ లైఫ్ విడుదలను నిలిపివేయాలని హెచ్చరిస్తున్నారు. కమల్ హాసన్ ఇటీవల ‘కన్నడ తమిళ భాష నుంచి పుట్టింది’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కన్నడ ప్రజల స్మాభిమానాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని భావించిన కన్నడ గ్రూపులు, ఆయన సినిమాను అడ్డుకోవాలని నిరసనలు తెలుపుతున్నారు. ద్రావిడ భాషల చరిత్రపై కమల్ మాట్లాడుతూ ‘కన్నడ, తెలుగు, మలయాళం భాషలు తమిళం నుంచి రూపుదిద్దుకున్నవే’ అని వ్యాఖ్యానించారు. తమిళం అనేది ద్రావిడ భాషలకు మూలం అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు కన్నడ భాషను అవమానించేలా ఉన్నాయని కన్నడ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
సినిమా ప్రదర్శన నిలిపివేయాలని హెచ్చరికలు
ప్రస్తుతం, బెంగళూరుతో (bengaluru) పాటు మైసూరు, హుబ్లీ తదితర ప్రాంతాల్లోని థియేటర్ల యజమానులకు మెమోరాండాలు అందజేస్తూ, సినిమా ప్రదర్శన ఆపాలని హెచ్చరిస్తున్నారు. జూన్ 5న థగ్ లైఫ్ మూవీ ప్రదర్శించాలని చూస్తే నిరసన తప్పదని హెచ్చరించారు. కమల్ హాసన్ ఇప్పటికీ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోలేదు. తాను చరిత్ర ఆధారితంగానే మాట్లాడానని ద్రావిడ భాషల మూలాన్ని వివరించానని తన వ్యాఖ్యల్ని తిరిగి సమర్థించుకున్నారు. దీంతో ఈ వివాదం తమిళనాడు – కర్ణాటక మధ్య భాషా సంస్కృతుల భావనను మళ్లీ తెరపైకి తీసుకువచ్చింది. కొన్ని వర్గాలు కమల్ హాసన్ వ్యాఖ్యల్ని చారిత్రక పరిశోధనల కోణంలో చూస్తున్నప్పటికీ, కన్నడ భాష అభిమాన వర్గాలు మాత్రం అవి తమ భాషను తక్కువ చూపించే ప్రయత్నంగా భావిస్తున్నాయని విమర్శలు చేస్తున్నారు. ఏకంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (cm sidda ramayya) కూడా కమల్ హాసన్ కు కన్నడ భాష చరిత్ర తెలియదని విమర్శించగా.. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కమల్ హాసన్ పై మండిపడుతున్నారు. ఇప్పటికైనా కన్నడ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.






