ఏటీసీలో సాంకేతిక సమస్య .. నెలల ముందే హెచ్చరించాం : ఏటీసీ గిల్డ్

by Naga Rani Yarlagadda |

దేశ రాజధాని ఢిల్లీ సహా ముంబై, హైదరాబాద్ నగరాల్లోని ఎయిర్ పోర్టుల్లో సాంకేతిక సమస్య కారణంగా పలు విమానాల రాకపోకలు..

ఏటీసీలో సాంకేతిక సమస్య .. నెలల ముందే హెచ్చరించాం : ఏటీసీ గిల్డ్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ సహా ముంబై, హైదరాబాద్ నగరాల్లోని ఎయిర్ పోర్టుల్లో సాంకేతిక సమస్య కారణంగా పలు విమానాల రాకపోకలు ఆలస్యమైన విషయం తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించి కీలక విషయం వెలుగులోకివచ్చింది. కొన్ని నెలల ముందే ఈ సమస్య గురించి ఎయిర్ పోర్ట్ అధికారులకు హెచ్చరికలు జారీ చేసినట్లుగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ (ATC) గిల్డ్ ఇండియా పేర్కొంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఈ ఏడాది జులైలో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)కి ఏటీసీలో సమస్యలు, అప్ గ్రేడ్ ల గురించి తెలియజేశామని, ఒక లేఖ కూడా రాశామని పేర్కొంది. కానీ అప్పుడు ఎవరూ పట్టించుకోలేదని తెలిపింది.

లేఖలో ఎయిర్ నేవిగేషన్ సేవల్లోఉపయోగించే ఆటోమేషన్ వ్యవస్థలను ఒకసారి పరిశీలించి, వాటిపై సమీక్షించి అప్ గ్రేడ్ చేయడం అవసరమని పేర్కొన్నట్లు తెలిపింది. భారత్ లోని వ్యవస్థలు కూడా యూరప్ యూరో కంట్రోల్, అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA)ల తరహాలో ఉండాలని చెప్పినట్లు వెల్లడించింది.

Next Story