- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీ బాధను, దుఃఖాన్ని పంచుకుంటున్నాం.. ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో మోడీ కీలక వ్యాఖ్యలు
ఇజ్రాయెల్ పార్లమెంట్ 'నెస్సెట్'లో ప్రధాని మోదీ చారిత్రక ప్రసంగం చేశారు. ఉగ్రవాదాన్ని ఖండిస్తూ, ఇజ్రాయెల్‌కు భారత్ ఎప్పటికీ అండగా ఉంటుందని ప్రకటించారు.

దిశ, వెబ్‌డెస్క్: హమాస్ (Hamas) జరిపిన అనాగరిక దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ఇజ్రాయెల్ (Israel) కుటుంబాలకు 140 కోట్ల మంది భారతీయుల తరఫున సానుభూతి తెలియజేస్తున్నానని ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) అన్నారు. ‘మీ బాధ, మీ దుఃఖాన్ని మేము పంచుకుంటున్నాము’ అంటూ అక్కడి పార్లమెంట్‌లో ఆయన భావోద్వేగంతో ప్రసంగించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని స్పష్టం చేస్తూ, ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌కు భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ఇప్పుడే కాకుండా, భవిష్యత్తులో కూడా భారత్ పూర్తి నిశ్చయంతో ఇజ్రాయెల్‌కు అండగా ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆ మాటలు విన్న ఇజ్రాయెల్ ఎంపీలు లేచి నిలబడి చప్పట్లతో అభినందనలు తెలిపారు. 2023, అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడి అత్యంత హేయమని అన్నారు. భారత్-ఇజ్రాయెల్ సంబంధాలు ప్రస్తుత అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత కీలకమని, ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
మోడీ మిత్రుడే కాదు.. సోదరుడు: నెతన్యాహు
మోదీ ప్రసంగానికి ముందే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ, కేవలం తనకు మిత్రుడు మాత్రమే కాదని.. సోదరుడని కొనియాడారు. మోదీ నాయకత్వంలో భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని కామెంట్ చేశారు. భారత్ చూపుతున్న మద్దతు మరువలేనిదంటూ నెతన్యాహు కృతజ్ఞతలు తెలిపారు.






