juvenile age: బాల నేరస్తుల వయసు 14 కు తగ్గించండి.. మరోసారి తెరపైకి జువైనల్ ఏజ్ ఇష్యూ

by Prasad Jukanti |   (  Updated:2025-12-06 07:11:15  IST  )

కృూరమైన నేరాలకు పాల్పడి బాలనేరస్తులనే కారణంతో శిక్ష నుంచి తప్పించుకుంటున్న వారి అంశం మరోసారి చర్చనీయాశంగా మారింది.

juvenile age: బాల నేరస్తుల వయసు 14 కు తగ్గించండి.. మరోసారి తెరపైకి జువైనల్ ఏజ్ ఇష్యూ
X

దిశ, డైనమిక్ బ్యూరో: క్రూరమైన నేరాలలో పాల్గొనే బాల నేరస్తుల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. బాలలు అనే కారణంతో అత్యంత ఘోరమైన నేరాలలో పాల్పడినా వారు శిక్ష నుంచి మినహాయింపు పొందుతున్నారు. దీనిపై చాలా కాలంగా దేశంలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం 17 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలను జువైనల్స్ గా పరిగణించపడుతుండగా ఆ వయసును తగ్గించాలని వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. ఈక్రమంలో తాజాగా ఈ జువైనల్ ఏజ్ (Juvenile Age Reduction) విషయంలో ఢిల్లీ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ప్రైవేట్ సభ్యుల బిల్లును పార్లమెంట్‍లో ప్రతిపాదించే యోచనలు ఉన్నట్లు చెప్పారు.

దారుణమైన నేరాలకు పాల్పడేవారిపై విచారణకు జువెనైల్ జస్టిస్ చట్టం 2015 కింద బాల నేరస్థుల వయస్సును 14 సంవత్సరాలకు తగ్గించాలని ప్రతిపాదిస్తానని మనోజ్ తివారీ (Manoj Tiwari) అన్నారు. లోక్‌సభలో ప్రైవేట్ సభ్యుల బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా దీనిని ప్రతిపాదించబోతుతన్నట్లు ఆయన తెలిపారు. మన దేశంలో జువైనల్ చట్టం (Juvenile Justice Act 2015) ప్రకారం 17 ఏళ్ల వరకు వారిని బాలలుగా పేర్కొంటున్నారు. కానీ పలు సందర్భాల్లో 15-17 ఏళ్ల లోపు ఉన్నవారు అత్యంత కృరమైన నేరాలకు పాల్పడుతున్న ఉదంతాలను నిరంతరం చూస్తునే ఉన్నామని, ఒక పిల్లవాడు మూడు హత్యలకు కారణమైన విషయం కూడా తనకు తెలుసని అందువల్ల బాలల వయస్సు 14 సంవత్సరాలకు తగ్గించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఓ బాలుడు నేరానికి పాల్పడి కరెక్షన్ సెంటర్‍కు వెళ్లి తరిగి వచ్చాక కూడా మరో హత్యకు పాల్పడ్డాడని ఇలాంటి వాటిని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఈ విషయంలో తాను చాలా ఆలోచించాకే ఈ సమస్యపై ప్రైవేట్ మెంబర్ బిల్లును సభలో ప్రవేశపెట్టాలనే ఆలోచనతో ఉన్నట్టు చెప్పారు.

కాగా గత నవంబర్‌లో గురుగ్రామ్‌లో 17 ఏళ్ల విద్యార్థి తన తండ్రి లైసెన్స్ పొందిన పిస్టల్‌తో తన స్కూల్‌మేట్‌పై కాల్పులు జరిపాడని ఆరోపణలు ఉన్నాయి. నిందితుడైన విద్యార్థిని, అతని స్నేహితుడితో పాటు, దాడిలో పాల్గొన్న ఇద్దరు మైనర్లను నేరం జరిగిన కొన్ని గంటల్లోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత అక్టోబర్‌లో ఢిల్లీ పటేల్ నగర్‌లో హత్యాయత్నం కేసులో ఢిల్లీ పోలీసులు ముగ్గురు బాలనేరస్థులను అరెస్టు చేశారు. అక్టోబర్ 10న స్థానిక ముఠా సభ్యుడు మరొక ప్రత్యర్థి ముఠా సభ్యుడిపై కత్తితో దాడి చేయడంతో ఈ సంఘటన జరిగింది. ఈ దాడి కారణంగా, గాయపడిన వారికి తీవ్ర గాయాలయ్యాయని ఒక అధికారి తెలిపారు.

Next Story