మేమేమన్న సీఎం పోస్టు అడిగామా?.. బీహార్ ఎన్నికల వేళ బీజేపీకి మిత్రపక్షం అల్టిమేటం

by Prasad Jukanti |

బీఅర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్డీయే మిత్రపక్షంలో సీట్ల సర్దుబాటు సంచలనంగా మారింది.

మేమేమన్న సీఎం పోస్టు అడిగామా?.. బీహార్ ఎన్నికల వేళ బీజేపీకి మిత్రపక్షం అల్టిమేటం
X

దిశ, డైనమిక్ బ్యూరో: బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు (Bihar Assembly elections) నోటిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్ కావడంతో ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య రాజకీయం వేడెక్కింది. రెండు పక్షాలు తమ మిత్రుల మధ్య సీట్ల సర్దుబాటుపై దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న హిందుస్థాన్ అవామ్ మోర్చా అధ్యక్షుడు జీతన్ రామ్ మాంఝీ (Jeetan Ram Manjhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు 15 సీట్లు ఇవ్వాలని పట్టుబడ్డారు. మాకు గౌరవప్రదమైన సీట్లు కావాలని అందుకు మేము 15 స్థానాలు డిమాండ్ చేస్తున్నామన్నారు. మేము కోరినన్ని సీట్లు ఇవ్వకపోతే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటామని స్పష్టం చేశారు. పోటీకీ దూరంగా ఉన్నా తాము ఎన్డీయేలోనే కొనసాగుతామన్నారు. తామేమి సీఎం పదవి కోరడం లేదని మా పార్టీకి గుర్తింపు కావాలని మాత్రమే కోరుతున్నామన్నారు. బిహార్ ఎన్నికల చదరంగంలో ఎన్డీయే కూటమిలో జేడీయూ, బీజేపీ, హిందూస్థాన్ అవామ్ మోర్చా, ఎల్జేపీ, ఉపేంద్ర కుశ్వాహా పార్టీలు ఉండగా ఇండియా కూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్, ఇతర పార్టీలు ఉన్నాయి. అయితే ఎన్డీయే కూటమిలో

Next Story