- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అరగంట తర్వాత పాక్‌కు చెప్పాం.. కాంగ్రెస్ విమర్శలకు జైశంకర్ సమాధానం
ఉగ్రస్థావరాలపై దాడి జరిగిన అరగంట తర్వాత పాక్‌కు విషయం చెప్పామని జైశంకర్ స్పష్టంచేశారు. కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తోందన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై భారత దళాలు దాడి చేసిన 30 నిమిషాల తర్వాత ఈ విషయాన్ని పాక్ మిలటరీకి తెలియజేసినట్లు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. కొన్నిరోజుల క్రితం ఒక వార్తాసంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ ‘ఆపరేషన్ ఆరంభంలో పాకిస్తాన్‌కు సమాచారం ఇచ్చాం. కానీ వాళ్లు మా మాట వినకుండా ప్రతిదాడికి దిగారు’ అని చెప్పారు. దీంతో ప్రతిపక్షాలు, ముఖ్యంగా విపక్ష నేత రాహుల్ గాంధీ.. జైశంకర్‌ను టార్గెట్ చేశారు. మిలటరీ చర్యల కన్నా ముందే పాకిస్తాన్‌కు ఎలా సమాచారం అందిస్తారు? దీని వల్ల మనం ఎన్ని విమానాలు కోల్పోయాం? అంటూ నిలదీశారు. ఈ ఆరోపణలపై బీజేపీ వర్గాలు స్పందించిన డీజీఎంవోల ప్రెస్ మీట్‌లో కూడా ఉగ్రస్థావరాలపై దాడులు జరిగిన వెంటనే పాక్‌కు సమాచారం అందించామని తెలిపిన విషయాన్ని గుర్తుచేశారు.
అయితే రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు కూడా జైశంకర్ వ్యాఖ్యలను పట్టుకొని విమర్శల వర్షం కురిపించారు. ఈ క్రమంలో సోమవారం జరిగిన కన్సల్టేటివ్ కమిటీ మీటింగ్‌లో జైశంకర్ స్పందించారు. ‘ఉగ్రస్థావరాలపై దాడి జరిగిన తర్వాత విదేశాంగ శాఖ సెక్రటరీకి విషయం చెప్పారు. ఆ తర్వాత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రకటన విడుదల చేశాం. ఆ తర్వాత మన డీజీఎంవో నేరుగా పాక్ డీజీఎంవోకు ఆపరేషన్ గురించి సమాచారం అందించారు’ అని స్పష్టంచేశారు. అలాగే విపక్షాల విమర్శలపై స్పందిస్తూ.. ఇవన్నీ వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నాలని కొట్టిపడేశారు. అలాగే భారత విదేశాంగ విధానం కూడా ఫెయిలైందని, భారత్‌ను పాక్‌తో సమానంగా ఎందుకు ప్రపంచం చూస్తోందని విమర్శించారు. దీనికి కూడా సమాధానం ఇచ్చిన జైశంకర్.. కేవలం రెండు దేశాలు మాత్రమే పాక్‌కు బహిరంగంగా మద్దతిచ్చాయని, మిగతా దేశాలు భారత్‌కు సపోర్ట్ ఇచ్చాయని, లేదా ఉగ్రవాదంపై దాడులను సమర్థించాయని గుర్తుచేశారు. చైనా కూడా ఆపరేషన్ సమయంలో పాక్‌కు బహిరంగంగా మద్దతివ్వలేదని చెప్పారు.
అలాగే కాల్పుల విరమణలో అమెరికా పాత్ర గురించి కూడా ప్యానెల్‌కు జైశంకర్ వివరణ ఇచ్చారు. ‘భారత్‌పై భారీ దాడులకు పాక్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం వచ్చినట్లు యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రుబియో చెప్పారు. అయితే పాక్ కనుక దాడి చేస్తే అంతకన్నా భయంకరమైన దాడిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయనకు స్పష్టంచేశాను’ అని జైశంకర్ వెల్లడించారు. అలాగే పాకిస్తాన్ డీజీఎంవో కాల్ చేస్తేనే కాల్పుల విరమణకు ఒప్పుకున్నామని, ఈ విషయంలో మరో దేశం జోక్యం ఏమాత్రం లేదని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు.






