PM Narendra Modi : మావోయిస్టులపై విజయం సాధించాం : ప్రధాని మోడీ

by Muthe.Rajitha |   (  Updated:2025-05-21 11:52:43  IST  )

ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లోని నారాయణపూర్(Narayapur Encounter) లో బుధవారం జరిగిన ఎదురు కాల్పుల్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.

PM Narendra Modi : మావోయిస్టులపై విజయం సాధించాం : ప్రధాని మోడీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లోని నారాయణపూర్(Narayapur Encounter) లో బుధవారం జరిగిన ఎదురు కాల్పుల్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మృతుల్లో మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రెటరీ నంబాల కేశవరావు(Namabala Keshavarao) అలియాస్ బసవరాజ్ అలియాస్ గంగన్న ఉన్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) స్పందిస్తూ.. మావోయిస్టులపై ఈ అద్భుత విజయాన్ని సాధించిన భద్రతా బలగాలను అభినందిస్తున్నాను అన్నారు. దేశంలో ప్రజలకు శాంతియుత జీవనాన్ని అందించడం కోసం మావోయిస్టులను, మావోయిజాన్ని తొలగిస్తామని ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని తన ఎక్స్ ఖాతా వేదికగా ట్వీట్ చేశారు. కాగా కాసేపటి క్రితమే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. 2026 మార్చి 31వ తేదీ నాటికి దేశంలోనే మావోయిస్టులు లేకుండా చేస్తామని తెలిపారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ద్వారా ఇప్పటివరకు 84 మంది మావోయిస్టులు లొంగిపోయారని, 50 మందికి పైగా అరెస్ట్ చేశామని చెప్పారు. మావోయిస్టు పార్టీ ఉద్యమానికి నంబాల కేశవరావు వెన్నెముకగా ఉన్నారని చెప్పారు.

Next Story