అమర్‌నాథ్‌ యాత్రికుల భద్రతకు కట్టుబడి ఉన్నాం: కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్

by Kema Shiva Kumar |

అమర్‌నాథ్ యాత్ర (Amarnath Yathra)కు తరలివచ్చే భక్తుల భద్రతకు కట్టుబడి ఉన్నామని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ (Gajendra Singha Shekawath) అన్నారు.

అమర్‌నాథ్‌ యాత్రికుల భద్రతకు కట్టుబడి ఉన్నాం: కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
X

దిశ, వెబ్‌డెస్క్: అమర్‌నాథ్ యాత్ర (Amarnath Yathra)కు తరలివచ్చే భక్తుల భద్రతకు కట్టుబడి ఉన్నామని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ (Gajendra Singha Shekawath) అన్నారు. ఇవాళ ఆయన దక్షిణ కాశ్మీర్‌లోని అనంతనాగ్ (Ananthnag) జిల్లాలోని మట్టన్‌ (Mattan)లో ఉన్న మార్తాండ సూర్య దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాశ్మీర్ లోయలోని పర్యావరణం, సహజ సౌందర్యాన్ని అమర్‌నాథ్ యాత్రకు వచ్చే పర్యాటకులు సంరక్షించాలని విజ్ఞప్తి చేశారు. అమర్‌నాథ్ యాత్ర అత్యంత సురక్షితమని.. ఏ ఒక్క పర్యాటకుడి మీద చిన్న గీత కూడా పడకుండా కాపాడుతామని, నిర్భయంగా కశ్మీర్‌కు రావాలని హామీ ఇచ్చారు. అమర్‌నాథ్ యాత్ర జూలై 3 నుంచి ఆగస్టు 9న ముగుస్తుందని అన్నారు. అనంతరం ఆయన పహల్గాం (Pahelgam)లో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ప్రాంతానికి వెళ్లారు. 140 కోట్ల భారతీయులు కశ్మీర్ యొక్క వారసత్వంతో పాటు దాని చారిత్రక గొప్పతనం, దైవత్వం, సహజ సౌందర్యాన్ని చూడాలని గజేంద్ర సింగ్ షెకావత్ విజ్ఞప్తి చేశారు.

Next Story