- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Malaysia: మనవి ఇస్లాం దేశాలు.. భారత్ మాటలు వినకండి
పాక్ కు మలేషియా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఉగ్రకుట్రలను బయటపెట్టేందుకు పార్లమెంటు సభ్యులతో కూడిన ప్రతినిధి బృందాలు ఆయా దేశాల్లో పర్యటిస్తోంది.

దిశ, నేషనల్ బ్యూరో: పాక్ కు మలేషియా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఉగ్రకుట్రలను బయటపెట్టేందుకు పార్లమెంటు సభ్యులతో కూడిన ప్రతినిధి బృందాలు ఆయా దేశాల్లో పర్యటిస్తోంది. అయితే, భారత్ ప్రయత్నాలను అడ్డుకునేందుకు పాక్ ప్రయత్నాలు చేసింది. కాగా.. భారత ప్రతినిధి బృందం మలేషియాలో నిర్వహించాలనుకున్న కార్యక్రమాలన్నింటిని రద్దు చేయాలని పాక్ చేసిన అభ్యర్థనను అక్కడి ప్రభుత్వం పట్టించుకోలేదు. మతం అంశాన్ని ముందుపెట్టింది. ‘‘మనవి ఇస్లాం దేశాలు. భారత ప్రతినిధుల మాటలు వినకండి. ఆ దేశ బృందం కార్యక్రమాలను రద్దు చేయండి’’ అని అభ్యర్థించింది. తమ దేశంలో భారత ఎంపీలు కార్యక్రమాలు ఏర్పాటుచేసుకోవడానికి అనుమతించింది.
మలేషియాలో భారత ప్రతినిధి బృందం పర్యటన
ప్రణాళిక ప్రకారం జనతాదళ్(యూ)కు చెందిన పార్లమెంటు సభ్యుడు సంజయ్ ఝా (JDU MP Sanjay Jha delegation) నేతృత్వంలోని అఖిలపక్ష దౌత్య ప్రతినిధి బృందం మలేసియా (Malaysia)లో పర్యటిస్తుంది. ఆ బృందం పాల్గొనాలనుకున్న 10 కార్యక్రమాల రద్దు కోసం పాక్ ఎంబసీ మలేసియా ప్రభుత్వాన్ని కోరింది. దీంతోపాటు కశ్మీర్ అంశం ఐక్యరాజ్యసమితి పరిశీలనలో ఉందని మలేషియా సహా పలు దేశాలను భారత్‌కు దూరం చేసే ప్రయత్నాలు చేసింది. కానీ మలేసియా మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు. తమ దేశంలో భారత ఎంపీలు కార్యక్రమాలు ఏర్పాటుచేసుకోవడానికి అనుమతించింది. దాంతో మన బృందం పాక్ ప్రేరేపిత తీవ్రవాదంపై అక్కడి ప్రభుత్వానికి అవగాహన కల్పించడంతోపాటు భారత్ తీసుకుంటున్న చర్యలను వివరించింది. ఆ సమావేశాల విజువల్స్ ను సంజయ్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. మలేసియాతో పాటు జపాన్, దక్షిణ కొరియా, ఇండోనేసియా, సింగపూర్‌లలో ఈ బృందం పర్యటిస్తోంది.






