- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
China:ఫెంటనిల్ పేరుతో బ్లాక్ మెయిలింగ్- అమెరికాపై చైనా విమర్శలు
టారీఫ్ లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీరుపై ప్రతిచోటా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చైనా దిగుమతులపై 10 శాతం అదనపు సుంకాలు విధిస్తామన్న ట్రంప్ వ్యాఖ్యలపై బీజింగ్ మండిపడింది.

దిశ, నేషనల్ బ్యూరో: టారీఫ్ లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీరుపై ప్రతిచోటా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చైనా దిగుమతులపై 10 శాతం అదనపు సుంకాలు విధిస్తామన్న ట్రంప్ వ్యాఖ్యలపై బీజింగ్ మండిపడింది. వాషింగ్టన్ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు మండిపడింది. పెంటనిల్ అంశాన్ని వాడుకుంటూ టారీఫ్ ల పేరుతో అమెరికా బ్లాక్ మెయిల్ కు పాల్పడుతోందని డ్రాగన్ ఆరోపించింది. చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి లిన్ జియాంగ్ మాట్లాడుతూ.. ‘‘టారిఫ్ ల పెంపు, బ్లాక్‌మెయిలింగ్ కోసం ఫెంటనిల్ అంశాన్ని అమెరికా వాడుకుంటోంది. ఈ పరిణామాలు తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అంతేకాకుండా, ఒత్తిడి, నిర్బంధం, మాదకద్రవ్యాల నియంత్రణలో ఇరుదేశాల మధ్య చర్చలు, సంప్రదింపులకు ముప్పుగా మారుతుంది’’ అని చెప్పుకొచ్చారు. అయితే, పరిస్థితులు మారకుండే ఈ చర్యలపై దీటుగానే స్పందిస్తామని హెచ్చరించారు. మరోవైపు, చైనా కామర్స్ మినిస్ట్రీ స్పందిస్తూ.. అత్యంత కఠినమైన మాదక ద్రవ్యాల నిరోధక విధానాలు అమలు చేస్తున్నామని పేర్కొంది. వీలైనంత త్వరగా అమెరికాతో చర్చలు జరపాలని చూస్తున్నామన్నారు. లేదంటే ప్రతీకారం తప్పదని హెచ్చరించారు.
చైనాపై విమర్శలు
మరోవైపు, బీజింగ్ వ్యాఖ్యలపైనా అమెరిగా ఘాటుగా స్పందించింది. అమెరికా విదేశాంగశాఖ కార్యదర్శి మార్కో రుబియో కూడా ఇదే అంశంపై మాట్లాడారు. ఫెంటనిల్‌పై చైనా రివర్స్ యుద్ధం చేస్తోందని ఆరోపించారు. కావాలనే అమెరికాలో దాన్ని పెద్ద ఎత్తున పంపిణీ చేస్తుండవచ్చనే అనుమానం కూడా వ్యక్తం చేశారు. ఇకపోతే, ఇప్పటికే చైనా ఉత్పత్తులపై 10 శాతం టారీఫ్ లు విధించిన ట్రంప్.. అదనంగా మరో 10 శాతం పన్నులు విధిస్తామని ప్రకటించారు. దీనిపైనే బీజింగ్ గుర్రుగా ఉంది. అంతేకాకుండా మెక్సికో, కెనడాల దిగుమతులపై ప్రతిపాదించిన 25శాతం సుంకాలు మార్చి 4 నుంచి అమల్లోకి రానున్నాయి.






