- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Warren Buffett: పతనమయ్యే ప్రమాదంలో 'డాలర్': వారెన్ బఫెట్
అమెరికా ఆర్థికలోటు నిలకడలేనిదని, నియంత్రించలేని స్థాయికి చేరిందని వారెన్ బఫెట్ వాటాదారులతో చెప్పారు.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచ దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ తాజాగా జరిగిన తన కంపెనీ బర్క్‌షైర్ హాత్‌వే వాటాదారుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న అమెరికా ఆర్థికలోటుపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, పెట్టుబడిదారులు అమెరికా డాలర్‌ను కాకుండా ఇతర కరెన్సీల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. అమెరికా ఆర్థికలోటు సమస్య ఎప్పటి నుంచో పరిష్కారం లేకుండా పోయిందని, భవిష్యత్తులోనూ మరో 2 లేదా 20 ఏళ్లైనా ఇలాగే ఉంటుందేమో అన్నారు. అమెరికా ఆర్థికలోటు నిలకడలేనిదని, నియంత్రించలేని స్థాయికి చేరిందని వారెన్ బఫెట్ వాటాదారులతో చెప్పారు. ప్రస్తుతం అమెరికా ఆర్థికలోటు 7 శాతం ఉంది. ట్రంప్ ప్రభుత్వాన్ని ప్రస్తావించకుండానే, వాణిజ్యాన్ని ఆయుధంగా ఉపయోగించకూడదని బఫెట్ అభిప్రాయపడ్డారు. డాలర్‌కు సంబంధించి, 'పతనమయ్యే' అవకాశం ఉన్న కరెన్సీని ఏ పెట్టుబడిదారులు కొనలేరు. ప్రస్తుతం అమెరికాలో అదే జరుగుతోంది. చాలామంది ఇన్వెస్టర్లలో ఇతర కరెన్సీలలోనూ పెట్టుబడి పెట్టాలనే ఆలోచన పెరిగిందని తెలిపారు. అమెరికా ఆర్థిక విధానాలు, పెరుగుతున్న అధికార అసమర్థత, వాణిజ్య విధానం రాజకీయ ఆయుధంగా మారుతుండటం వంటి అంశాలు డాలర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని బఫెట్ వివరించారు. డాలర్ రూపంలో కాకుండా ఏదైనా యూరోపియన్ దేశంలో వారి కరెన్సీలో పెట్టుబడులు పెడితే ఎక్కువ మొత్తం ఫైనాసింగ్ చేయగలిగే వీలుంటుందని బఫెట్ పేర్కొన్నారు.






