- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
War: యుద్ధం ఎలా చేయాలో భారత్‌ను చూసి నేర్చుకోవాలి.. ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్
లైనంత త్వరగా యుద్ధాన్ని ఎలా ప్రారంభించాలో, ఎలా ముగించాలో భారత్‌ను చూసి ప్రపంచం నేర్చుకోవాలని ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్ అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: వీలైనంత త్వరగా యుద్ధాన్ని ఎలా ప్రారంభించాలో, ఎలా ముగించాలో భారత్‌ను చూసి ప్రపంచం నేర్చుకోవాలని ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్ (Ap singh) అన్నారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘రష్యా ఉక్రెయిన్ (Russi Ukrein), ఇజ్రాయెల్ హమాస్ (Israel Hamas) మధ్య అనేక ఏళ్లుగా యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు అవి ముగిసే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఎవరూ ఘర్షణ ముగింపు గురించి ఆలోచించడం లేదు. వీలైనంత త్వరగా ఘర్షణను ఎలా ముగించాలో ఇండియాను చూసి నేర్చుకోవాలి’ అని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ టైంలో ఇండియా తన లక్ష్యాలను సాధించిందని తెలిపారు. అందుకే ఘర్షణను త్వరగా క్లోజ్ చేశామని వెల్లడించారు.
వార్ సమయంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, ఘర్షణ సుధీర్ఘ కాలం కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్-400 , ఎల్ ఆర్ఎస్ఏఎం గేమ్-ఛేంజర్‌గా మారాయని కొనియాడారు. పాకిస్తాన్‌కు చెందిన లాంగ్-రేంజ్ రాడార్లు, క్షిపణి వ్యవస్థలు, విమానాలను ఎదుర్కొన్నాయని తెలిపారు. భారత సాయుధ దళాలు లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించగలిగాయన్నారు.






