- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gulf War: భారీగా తగ్గిన కోడి గుడ్డు ధరలు
ఇరాన్ - ఇజ్రాయెల్ - అమెరికా దేశాలు గతవారం రోజులుగా పరస్పరం దాడులు చేసుకుంటున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్ - ఇజ్రాయెల్ - అమెరికా దేశాలు గతవారం రోజులుగా పరస్పరం దాడులు చేసుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి పశ్చిమాసియా రగులుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ, ఆయన కుటుంబసభ్యులు, కీలక నాయకులు చనిపోయారు. దీంతో ఇరాన్ ప్రతీకారం కట్టలు తెంచుకుంది. గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తోంది. గత ఆరు రోజుల నుంచి భీకర యుద్ధం కొనసాగుతుంది. దీని కారణంగా ఎక్కడికక్కడ విమానాలు నిలిచిపోయాయి. ఈ యుద్ధ ప్రభావం ప్రపంచ వ్యాప్త పౌల్ట్రీ రంగంపై తీవ్రంగా పడింది. ఎక్కడికక్కడ ఎగుమతులు నిలిచిపోవడంతో పాటు కోడి గుడ్డు ధరలు భారీగా పడిపోయాయి. తద్వారా పౌల్ట్రీ పరిశ్రమకు రోజుకు రూ.5 కోట్ల నష్టం వాటిల్లుతోంది. దీనికి పోర్ట్‌లు, ఎయిర్‌పోర్టుల మూసివేతే ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ ధర రూ.4.30 ఉండగా.. స్థానిక మార్కెట్లలో రూ.3.30కి పడిపోయింది. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల మార్కెట్‌పైనా ప్రభావం పడింది.






