ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం.. స్వదేశానికి 110 మంది భారతీయ విద్యార్థులు

by Kema Shiva Kumar |

ఇరాన్-ఇజ్రాయెల్ (Iran-Israel) మధ్య యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది.

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం.. స్వదేశానికి 110 మంది భారతీయ విద్యార్థులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్-ఇజ్రాయెల్ (Iran-Israel) మధ్య యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో ఇరాన్ రాజధాని తెహ్రాన్‌ (Tehran)లో భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత రాయబార కార్యాలయం ‘ఆపరేషన్ సింధు’ (Operation Sindhu) చేపట్టింది. ఇందులో భాగంగా శక్రవారం తెహ్రాన్ నుంచి 110 మంది భారతీయ విద్యార్థులను సరిహద్దులు దాటించి అర్మేనియాకు తరలించారు. అనంతరం అక్కడి నుంచి ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో వారంతా ఢిల్లీ (Delhi)కి చేరుకున్నారు. ఈ సందర్భంగా యుద్ధ సమయంలో జమ్మూకశ్మీర్‌ (Jammu Kashmir)కు చెందిన స్వదేశానికి తీసుకురావడం పట్ల విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ (Jaishankar)కు, ప్రధాని నరేంద్ర మోడీ (PM Narandra Modi)కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్‌లో చిక్కుకుపోయిన మరికొంతమంది విద్యార్థులను త్వరలోనే స్వదేశానికి తీసుకురావాలని కోరారు.

Next Story