Waqf bill: రేపు లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు.. వెల్లడించిన కేంద్రం

by B.Srinivas |

వక్ఫ్ సవరణ బిల్లును బుధవారం లోక్ సభలో ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.

Waqf bill: రేపు లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు.. వెల్లడించిన కేంద్రం
X

దిశ, నేషనల్ బ్యూరో: వక్ఫ్ సవరణ బిల్లు (Waqf amendment bill) ను బుధవారం లోక్ సభ (Loke sabha)లో ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు (Kiran rijiju) వెల్లడించారు. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై చర్చకు ప్రభుత్వం ఎనిమిది గంటల సమయం కేటాయించింది. స్పీకర్ ఆదేశాల మేరకు దీనిని మరింత పొడిగించే చాన్స్ ఉంది. స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన మంగళవారం జరిగిన బీఏసీ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే బిల్లుపై డిస్కస్ చేయడానికి 12 గంటలు కేటాయించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టగా అందుకు ప్రభుత్వం నిరాకరించింది. దీంతో బీఏసీ సమావేశం నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. ప్రభుత్వం తమ గొంతులను అణచిస్తోందని ఆరోపించాయి. చర్చకు మరింత సమయం కోరకుంటున్నామని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ తెలిపారు.

లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బీజేపీ తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. దిగువ సభలో చర్చకు తప్పకుండా హాజరుకావాలని సూచించింది. అలాగే కాంగ్రెస్ సైతం తమ సభ్యులకు మూడు లైన్ల విప్ జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు సభలో తప్పని సరిగా ఉండాలని తెలిపింది. గతేడాది ఈ బిల్లును లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టింది. అనంతరం దీనిపై ఏకాభిప్రాయం తీసుకురావడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేసింది. పలు చర్చల అనంతరం జేపీసీ తన నివేదికను సమర్పించింది. ఈ నేపథ్యంలోనే బిల్లును ప్రవేపెట్టేందుకు సిద్ధమైంది. అయితే బడ్జెట్ సమావేశాలు ముగియనున్న క్రమంలోనే కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Next Story