waqf act: వక్ఫ్ పిటిషన్లపై రేపు సుప్రీంకోర్టులో విచారణ..10 పిటిషన్లను విచారించనున్న బెంచ్

by vinod kumar |
waqf act: వక్ఫ్ పిటిషన్లపై రేపు సుప్రీంకోర్టులో విచారణ..10 పిటిషన్లను విచారించనున్న బెంచ్
X

దిశ, నేషనల్ బ్యూరో: వక్ఫ్ సవరణ చట్టాని (waqf amendment act) కి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme court) బుధవారం విచారణ చేపట్టనుంది. సీజేఐ సంజీవ్ ఖన్నా (Sanjeev Khanna) నేతృత్వంలోని సంజయ్ కుమార్, కేవీ విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం దాదాపు 10 పిటిషన్లను విచారించనుంది. వక్ఫ్ (సవరణ) చట్టంలోని అనేక నిబంధనల రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, ఇది ప్రాథమిక హక్కులకు ఉల్లంఘిస్తుందని ఆరోపించారు. ఈ సవరణలు వక్ఫ్‌ బోర్డుల మతపరమైన గుర్తింపును వక్రీకరిస్తాయని, వక్ఫ్ పరిపాలనను నియంత్రించే ప్రజాస్వామ్య ప్రక్రియలను బలహీనపరుస్తాయని పిటిషనర్లు వాదించారు. కాబట్టి ఈ విషయంపై క్లారిటీ వచ్చే వరకు చట్టం అమలును నిలిపివేయాలని కోరారు. పిటిషనర్లలో లోక్‌సభ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్, అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ (ఏపీసీఆర్), మౌలానా అర్షద్ మదానీ, సమస్తా కేరళ జమియతుల్ ఉలేమా, అంజుమ్ కద్రీ సీపీఐ పార్టీ సహా తదితరులు ఉన్నారు. అయితే కేంద్రం సైతం ఈ అంశంపై సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది.

Next Story

Most Viewed