Wang Yi: భారత్‌కు చైనా విదేశాంగ మంత్రి.. కీలక సమస్యపై చర్చించే చాన్స్

by B.Srinivas |

భారత్ చైనాల మధ్య దీర్ఘకాలంగా ఉన్న సరిహద్దు సమస్యపై 24వ రౌండ్ ప్రత్యేక ప్రతినిధుల చర్చల్లో పాల్గొనడానికి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్‌ను సందర్శించనున్నారు.

Wang Yi: భారత్‌కు చైనా విదేశాంగ మంత్రి.. కీలక సమస్యపై చర్చించే చాన్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ చైనాల మధ్య దీర్ఘకాలంగా ఉన్న సరిహద్దు సమస్యపై 24వ రౌండ్ ప్రత్యేక ప్రతినిధుల చర్చల్లో పాల్గొనడానికి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ (Wang Yi) ఈ నెల 18, 19 తేదీల్లో భారత్‌ను సందర్శిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. వాంగ్ యీ తన పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి జైశంకర్ (Jai shanker), జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ (Ajith doval)తో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల సరిహద్దు సమస్యపై చర్చించన్నట్టు తెలుస్తోంది. భారత్ లోని చైనా రాయబారి జు ఫీహాంగ్ సైతం వాంగ్ యీ పర్యటనను ధ్రువీకరించారు. 2020లో సరిహద్దు ప్రతిష్టంభన ఏర్పడినప్పటి నుంచి కొనసాగుతున్న సైనిక, దౌత్య సంభాషణల నేపథ్యంలో ఈ చర్చలు కీలకమైనవిగా భావిస్తున్నారు. కాగా, రెండు దేశాలు ఉద్రిక్తతలను తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

Next Story