- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్థానిక ఎన్నికలకు వీవీప్యాట్‌లు తప్పనిసరి కాదు.. బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో వీవీప్యాట్ (VVPAT)లు తప్పనిసరి కాదని బాంబే హైకోర్టు (Bombay High Court) వెల్లడించింది.

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికల్లో వీవీప్యాట్ (VVPAT)లు తప్పనిసరి కాదని బాంబే హైకోర్టు (Bombay High Court) వెల్లడించింది. మహారాష్ట్రలో రాబోయే స్థానిక ఎన్నికల్లో వీవీప్యాట్‌లు వినియోగించకపోవడాన్ని సవాలు చేస్తూ.. కాంగ్రెస్ సీనియర్ నేత ప్రఫుల్ల గుడాడే దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ జస్టిస్ అనిల్ కిలోర్ (Justice Anil Kilor) నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే, పారదర్శకమైన ఎన్నికల నిర్వహణ కోసం వోటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ (VVPAT) వ్యవస్థ అత్యంత అవసరమని పిటిషనర్ తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపించారు.
ఈ క్రమంలోనే న్యాయమూర్తి మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు వీవీప్యాట్ ఉపయోగం తప్పనిసరని చెప్పినప్పుడు, దానిని ఎందుకు ఉపయోగించడం లేదని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. అందుకు ఆయన సమాధానమిస్తూ.. సుప్రీంకోర్టు తీర్పు కేవలం సాధారణ ఎన్నికలు (లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు)కు మాత్రమే వర్తిస్తుందని, స్థానిక సంస్థల ఎన్నికలకు వర్తించదని చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. స్థానిక ఎన్నికలకు వీవీప్యాట్‌లు తప్పనిసరి కాదని తీర్పు వెలువరించింది.






