ముగిసిన ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్.. కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం

by Kema Shiva Kumar |

ఉప రాష్ట్రపతిని ఎన్నికల పోలింగ్ ముగిసింది.

ముగిసిన ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్.. కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: ఉప రాష్ట్రపతిని ఎన్నికల పోలింగ్ ముగిసింది. జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామాతో ఖాళీ అయిన ఆ స్థానాన్ని (Vice President Election) భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పదవి కోసం ఎన్డీయే కూటమి నంచి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ (CP Radhakrishnan), ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్‌ బి.సుదర్శన్‌ రెడ్డి (B.Sudershan Reddy) బరిలో ఉన్నారు. పార్లమెంట్‌ నూతన భవనంలోని ‘ఎఫ్‌-101 వసుధ’లో ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. పోలింగ్ ప్రారంభమైన వెంటనే పార్లమెంట్ హౌస్‌కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi)తో పాటు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, జేపీ నడ్డా, రామ్మోహన్ నాయుడు, తదితరులు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఇండియా కూటమి నుంచి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ, ఇతర కాంగ్రెస్ ఎంపీలు, మిత్ర పక్షాల సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సరిగ్గా సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. 30 నిమిషాల్లోపు తుది ఫలితం వెలువడే అవకాశం ఉంది.

Next Story