ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం

by Malleboina Mahesh |

ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (DUSU) ఎన్నికల ఓటింగ్ ఉదయం 8. 30 గంటలకు ప్రారంభం అయింది.

ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (DUSU) ఎన్నికల ఓటింగ్ ఉదయం 8. 30 గంటలకు ప్రారంభం అయింది. ఈ ఎన్నికల నేపథ్యంలో యూనివర్సిటీ సిబ్బందితో పాటు 600 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించారు. పటిష్ట బందోబస్తు నడుమ ప్రశాంత వాతావరణంలో ఈ ఎన్నికలు కొనసాగుతున్నాయి. కాగా ఈ ఎన్నికల పోలింగ్‌లో విద్యార్థులు రెండు షిఫ్టులలో తమ ఓటును వేస్తారు. మొదటి షిఫ్ట్ పగటి తరగతులకు ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అలాగే రెండో షిఫ్టులో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7.30 వరకు పోలింగ్ గో విద్యార్థులు పాల్గొంటారు. ఈ ఈ ఎన్నికల్లో దాదాపు 2.8 లక్షల మంది విద్యార్థులు ఓటు వేయడానికి అర్హులుగా గుర్తించారు. ఇదిలా ఉంటే ఎన్నికల్లో ప్రధానంగా ఏబీవీపీ, ఎన్ఎస్ యూఐ, ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు పోటీలో ఉన్నాయి. కాగా ఈరోజు పోలింగ్ అనంతరం సెప్టెంబర్ 19 ఓట్ల లెక్కింపు ఫలితాలు ప్రకటించనున్నారు.

Next Story