- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Voting Age:16 ఏళ్లకే ఓటు హక్కు.. బ్రిటన్ సంచలన నిర్ణయం
బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటు హక్కు వయసును 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించేందుకు సిద్ధమైంది.

దిశ, నేషనల్ బ్యూరో: బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటు హక్కు వయసును 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించేందుకు సిద్ధమైంది. తదుపరి సార్వత్రిక ఎన్నికల నాటికే దీనిని అమలు చేయాలని భావిస్తోంది. ప్రధాని కీర్ స్టార్మర్ (Kier starmer) ఇప్పటికే ఈ ప్రతిపాదనను తీసుకురాగా దీనిని త్వరలోనే పార్లమెంట్‌లో ఆమోదించనుంది. ఇది దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలోనే కీలక మార్పు కానుంది. ప్రతిపాదిత మార్పులు పార్లమెంటరీ ఆమోదానికి లోబడి ఉన్నాయని, ప్రజాస్వామ్యంలో యువత భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి, వారికి ప్రాతినిధ్యం కల్పించడానికి ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఓటర్ ఐడీ కార్డుకు సంబంధించిన పత్రాల్లోనూ మార్పులు చేసింది. బ్యాంక్ కార్డులను ఓటరు ఐడీ కార్డులుగా ఉపయోగించొచ్చు. అలాగే విదేశీ జోక్యం, రాజకీయ విరాళాలపై నియమాలను సైతం కఠినతరం చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిపాయి. దీని ప్రకారం ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా విదేశాల నుండి 500 పౌండ్ల కంటే ఎక్కువ విరాళాలు తీసుకోలేరు.






