Voter Id:15 రోజుల్లోనే ఓటర్ కార్డు జారీ.. కొత్త ప్రక్రియను ప్రారంభించిన ఈసీ

by B.Srinivas |

: ఓటర్లకు ఐడీ కార్డులు అందించేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) నూతన విధానాన్ని తీసుకొచ్చింది. దరఖాస్తు చేసిన 15 రోజుల్లోనే ఓటర్ కార్డు జారీ చేయనుంది.

Voter Id:15 రోజుల్లోనే ఓటర్ కార్డు జారీ.. కొత్త ప్రక్రియను ప్రారంభించిన ఈసీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఓటర్లకు ఐడీ కార్డులు అందించేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) నూతన విధానాన్ని తీసుకొచ్చింది. దరఖాస్తు చేసిన 15 రోజుల్లోనే ఓటర్ కార్డు (Voter card) జారీ చేయనుంది. అలాగే ఓటర్ ఐడీలో సవరణలు, ఇతర మార్పులు చేసుకునే వారికి కూడా ఇదే విధానం వర్తించనుంది. దీని కోసం ఈసీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)ని ప్రవేశపెట్టినట్టు తెలిపింది. ఇది ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ERO) ద్వారా ఈసీఐసీ జనరేషన్ నుంచి పోస్టల్ డిపార్ట్‌మెంట్ (DoP) ద్వారా ఈపీఐసీ స్టాటస్ ను ట్రాక్ చేస్తుంది. దీనిపై ఓటరుకు ఎస్ఎంఎస్ ద్వారా కూడా ప్రతి దశలో సందేశం పంపిస్తారు. దీనిద్వారా 15 రోజుల్లోనే ఓటర్ కార్డ్ అందించేందుకు వీలవుతుంది. దీనికోసం ఈసీఐ ఇటీవల ప్రారంభించిన ఈసీఐనెట్ ప్లాట్‌ఫామ్‌లో ఒక ప్రత్యేక ఐటీ మాడ్యూల్‌ను ప్రవేశపెట్టింది.

Next Story