- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Voter id: నకిలీ ఓటర్ కార్డుల సమస్యకు చెక్.. త్వరలోనే వారికి కొత్త నంబర్లు !
ఒకే నంబర్ కలిగిన ఓటరు గుర్తింపు కార్డుల సమస్యను ఎన్నికల సంఘం పరిష్కరించిట్టు ఈసీ వర్గాలు తెలిపాయి.

దిశ, నేషనల్ బ్యూరో: ఒకే నంబర్ కలిగిన ఓటరు గుర్తింపు కార్డు (Voter id card) ల సమస్యను ఎన్నికల సంఘం (Election commission) పరిష్కరించినట్టు ఈసీ వర్గాలు తెలిపాయి. సేమ్ నంబర్ ఉన్న కార్డుదారులకు త్వరలోనే కొత్త ఈపీఐసీ నంబర్‌తో కూడిన కార్డును జారీ చేయనున్నట్టు తెలిపాయి. ఒకేలా ఉండే ఓటరు ఫోటో గుర్తింపు కార్డు, ఈపీఐసీ నంబర్లు కలిగి ఉండటం చాలా అరుదు అని, సగటున నాలుగు పోలింగ్ స్టేషన్లలో ఒకటి ఇలాగే ఉంటుందని తెలిపాయి. అయితే క్షేత్రస్థాయి ధ్రువీకరణలో ఒకే ఈపీఐసీ నంబర్లు కలిగి ఉన్న వ్యక్తులు వేర్వేరు నియోజకవర్గాల్లో వేర్వేరు పోలింగ్ కేంద్రాలకు చెందిన నిజమైన ఓటర్లేనని పేర్కొన్నాయి. దీనిపై సమగ్రంగా పరిశీలించి ఈ సమస్యను పరిష్కరించినట్టు స్పష్టం చేశాయి. ఈ వివరాలను ఈసీ సీనియర్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. ఒకే నంబర్ కలిగి ఉన్న వారికి కొత్త నంబర్ జారీ చేశామని తెలిపారు.
కాగా, ఓటర్ల జాబితాలు తారుమారు అయ్యాయని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సహా పలు ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో స్పందించిన ఈసీ ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారులు, 4,123 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 10.50 లక్షల పోలింగ్ కేంద్రాల ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు మొత్తం ఎన్నికల డేటాబేస్‌ను పరిశీలించి ప్రతి పోలింగ్ కేంద్రంలో సగటున ఒకే నంబర్ కలిగిన ఓటర్ ఐడీలను గుర్తించినట్టు తెలుస్తోంది. దీంతో దశాబ్దాల నాటి ఈ సమస్యకు తెరపడిందని పలువురు భావిస్తున్నారు.






