- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్వాతంత్య్రం తర్వాత మూడు సార్లు ఓట్ చోరీ జరిగింది.. అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక మొత్తం మూడు సందర్భాల్లో ఓట్ చోరీ జరిగిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక మొత్తం మూడు సందర్భాల్లో ఓట్ చోరీ జరిగిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఎన్నికల సంస్కరణలపై చర్చ సందర్భంగా లోక్‌సభ (Lok Sabha)లో ఆయన మాట్లాడుతూ.. మొదట దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ప్రధాన మంత్రి ఎంపికపై కీలక చర్చ జరిగిందని.. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రధానిని ఎంపిక చేయాల్సి వచ్చిందన్నారు. పోటీలో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు మూకుమ్మడిగా మద్దతు తెలిపితే.. ఆయనను తప్పించి జవహర్‌లాల్ నెహ్రూ (Jawaharlal Nehru)ను ప్రధానిని చేశారని ఆరోపించారు. రెండోసారి అలహాబాద్‌లో ఇందిరాగాంధీ (Indira Gandhi) ఓట్ చోరీ చేసి గెలిచిందని వాస్తవం కాదా అని ఫైర్ అయ్యారు. తాము సీఈసీకి ఇమ్యూనిటీ ఇచ్చామంటున్నారని.. గతంలో ఇందిరాగాంధీ తనకు తానే ఇమ్యూనిటీ ఇచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. ఇక సోనియాగాంధీ (Sonia Gandhi) భారత పౌరురాలు కాకముందే ఓటేసి ఓట్ చోరీకి పాల్పడ్డారని.. ఇలా స్వతంత్య్రం తర్వాత దేశంలో మూడు సార్లు ఓట్ చోరీ జరగిందని అమిత్ షా అన్నారు.






