- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అరుణాచల్ ప్రదేశ్ భారత్ దే అని చెప్పిన యూట్యూబర్‌కు చైనా విమానాశ్రయంలో వేధింపులు
అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగం అని చెప్పిన యూట్యూబర్‌కు చైనా విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. భారతీయ ట్రావెల్ వ్లాగర్ 'ఆన్ రోడ్ ఇండియన్ పేరుతో యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు చేస్తున్నాడు.

దిశ, వెబ్ డెస్క్: అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగం అని చెప్పిన యూట్యూబర్‌కు చైనా విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. భారతీయ ట్రావెల్ వ్లాగర్ 'ఆన్ రోడ్ ఇండియన్ పేరుతో యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు చేస్తున్నాడు. అయితే గతంలో అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో అంతర్భాగం అంటూ వీడియో చేశాడు. ఇటీవల అతడు చైనా పర్యటనకు వెళ్లగా విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు 15గంటల పాటు నిర్భంధించారు. ఈ విషయాన్ని అతడు వీడియో ద్వారా వెల్లడించాడు. అరుణాచల్ ప్రదేశ్ విషయంలో తాను తీసుకున్న స్టాండ్ వల్లనే ఈ సమస్య వచ్చిందని చెప్పాడు.
వారి దేశంలో నిలబడి ఆ వ్యాఖ్యలు చేయడం వారికి కొపం తెప్పించిందని అన్నాడు. తనతో పాటు ఉన్న ఇతర భారీతీయులకు ఆహారం ఇచ్చారు కానీ తనకు తిండి కూడా పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈశాన్య రాష్ట్రాలతో తనకు ఉన్న అనుబంధం కారణంగానే అరుణాచల్ పౌరుల నిర్బంధంపై స్పందించానని చెప్పాడు. ఇక ప్రస్తుతం యూట్యూబర్ వీడియో వైరల్ అవుతూ ఉండగా ట్విట్టర్ లోనూ అతడి పేరు ట్రెండింగ్ లోకి వచ్చింది. చైనా తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






