Vivek Ramaswam: అమెరికా గవర్నర్ ఎన్నికల్లో వివేక్ రామస్వామి పోటీ..!

by Shamantha N |
Vivek Ramaswam: అమెరికా గవర్నర్ ఎన్నికల్లో వివేక్ రామస్వామి పోటీ..!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇండో- అమెరికన్‌ బిజినెస్ మ్యాన్ వివేక్‌ రామస్వామి(Vivek Ramaswamy) గవర్నర్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. తన సొంత రాష్ట్రం ఒహియో(Ohio) నుంచి బరిలో నిలుస్తారని స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నారు. ఈ పోటీ గురించి రామస్వామి త్వరలో ప్రకటన విడుదల చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. ఇప్పటికే, డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) కార్యవర్గంలో వివేక్ కు చోటు దక్కింది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ(DOGE)కి వివేక్‌, టెస్లా అధిపతి ఎలాన్‌ మస్క్ సంయుక్త సారథులుగా వ్యవహరిస్తున్నారు. 2026 జులై 4న అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం జరగనుంది. ఆలోగా.. డీవోజీఈ లక్ష్యాన్ని పూర్తి చేసి, గవర్నర్‌ ఎన్నికల్లో పోటీ చేయడానికి వివేక్ రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇకపోతే, ఒహియో గవర్నర్ ఎన్నికలు నవంబర్ 2026లో జరగనున్నాయి. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా అవకాశం కోసం రామస్వామి ప్రయత్నించి ఓడిపోయారు. ఆ తర్వాత ట్రంప్ కు మద్దతు తెలుపు ఆయన విజయం కోసం కృషి చేశారు.

ట్రంప్ తరఫున ప్రచారం

ఇకపోతే, వివేక్‌ రామస్వామి(Vivek Ramaswamy) ఒహియోలో ఆగస్టు 9, 1985లో జన్మించారు. కేరళకు చెందిన ఆయన తల్లిదండ్రులు ఆమెరికా(America)కు వలస వచ్చారు. హార్వర్డ్ నుంచి బయోలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. యేల్‌ లా స్కూల్‌లో ఉన్నతవిద్యను పూర్తి చేశారు. విద్యాభ్యాసం అనంతరం సొంతంగా బయోటెక్ సంస్థ (Roivant Sciences)ను స్థాపించారు. అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ తరఫున ఇంటర్వ్యూల్లో వాదనలు వినిపించారు. రామస్వామి పనితీరును గమనించిన డొనాల్డ్‌.. పెన్సిల్వేనియాలో జరిగిన సభలో ఆయన్ను తన కార్యవర్గంలోకి తీసుకొంటానని ప్రకటించారు. మొదట ఆయనకు విదేశాంగ శాఖ బాధ్యతలు అప్పగిస్తారనే వార్తలు వచ్చాయి. కానీ, ట్రంప్‌ ప్రచార బృందంలో కీలక భూమిక వహించిన మార్కో రూబియో (Marco Rubio)కు ఆ శాఖ దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed