- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘వీసా’ అనేది హక్కు కాదు.. భారత్‌లోని US ఎంబసీ ఆసక్తికర పోస్టు
అగ్రదేశం అమెరికా (America) వెళ్లాలనుకునే భారతీయులకు అక్కడి ప్రభుత్వం వరుస హెచ్చరికలు జారీ చేస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: అగ్రదేశం అమెరికా (America) వెళ్లాలనుకునే భారతీయులకు అక్కడి ప్రభుత్వం వరుస హెచ్చరికలు జారీ చేస్తోంది. తాజాగా, సోషల్ మీడియా వెట్టింగ్ జోరుగా కొనసాగుతోన్న వేళ భారత్‌లోని యూఎస్ ఎంబసీ (US Embassy) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేసింది. వీసా పొందడం అనేది దరఖాస్తుదారుడి హక్కు కాదని, అది అమెరికా ప్రభుత్వం ఇచ్చే ఒక విశేష అధికారం మాత్రమేనని స్పష్టం చేసింది. అమెరికా చట్టాలు, ఇమ్మిగ్రేషన్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఎంబసీ అధికారులు వార్నింగ్ ఇచ్చారు.
వీసా మంజూరైనంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండవచ్చని భావించకూడదని, నిబంధనలు అతిక్రమిస్తే ఏ సమయంలోనైనా వీసాను రద్దు చేసే అధికారం తమ దేశానికి ఉంటుందని ఎంబసీ స్పష్టం చేసింది. అమెరికాలో ఉన్న సమయంలో గృహహింస, దాడులు, ఇతర తీవ్రమైన నేరాల్లో అరెస్టు అయితే, వారి వీసాను వెంటనే రద్దు చేసి, దేశం నుంచి బహిష్కరిస్తామని గుర్తు చేశారు. భవిష్యత్తులో మళ్లీ వీసా పొందేందుకు వారిని అనర్హులుగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. వీసా జారీ చేసిన తర్వాత కూడా వలసదారుల ప్రవర్తనను, కదలికలను అధికారులు నిశితంగా గమనిస్తూనే ఉంటారని ఎంబసీ పేర్కొంది. వీసా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా (Social Media) అకౌంట్ల వివరాలను సరైన విధంగా సమర్పించాలని ఎంబసీ సూచించింది. అకౌంట్లను ప్రైవేట్‌లో ఉంచకుండా పబ్లిక్‌లో ఉంచాలని, వివరాలు దాచకూడదని ఆదేశించింది.






