- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టూడెంట్‌తో మహిళా ప్రొఫెసర్ వివాహం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే
ఈ వీడియోను కావాలనే కొంత మంది లీక్ చేశారని పాయల్ ఆరోపిస్తున్నారు. అయితే సదరు విద్యార్థి వివరాలు మాత్రం బయటకు రాలేదు.

- క్లాస్ రూంలో దండలు మార్చుకున్న జంట
- వైరల్ అయిన వీడియో
- విచారణకు ఆదేశం
దిశ, నేషనల్ బ్యూరో:
క్లాస్ రూంలో విద్యార్థిని మహిళ ప్రొఫెసర్ వివాహం చేసుకున్న సంఘటనపై అధికారులు గురువారం విచారణకు ఆదేశించారు. పశ్చిమ బెంగాల్‌లోని నదియాలో ఉన్న హరింఘట టెక్నాలజీ కళాశాలకు చెందిన పాయల్ బెనర్జీ అనే మహిళా ప్రొఫెసర్ విద్యార్థిని పెళ్లి చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఇద్దరూ పెళ్లి దుస్తులు ధరించి, దండలు మార్చుకోవడం ఆ వీడియోలో స్పష్టంగా కనపడింది. పాయల్ బెనర్జీ కొన్నాళ్లుగా సైకలాజికల్ ఫ్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఈ సంఘటన తర్వాత మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ యూనివర్సిటీ అధికారులు త్రిసభ్య కమిటీని వేసి, విచారణకు ఆదేశించారు. అప్పటి వరకు బెనర్జీని లీవ్‌పై వెళ్లాలని చెప్పినట్లు సమాచారం.
కాగా, ఇది నిజమైన పెళ్లి కాదని.. అకడమిక్ ఎక్సర్‌సైజ్‌లో భాగంగా కాలేజీ ఇంటర్నల్స్ కోసమే చేసిన ప్రయోగమని ప్రొఫెసర్ పాయల్ చెబుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో విద్యార్థికి పసుపు అద్దుతూ కనిపించారు. ఇక ఇద్దరూ దండలు మార్చుకొని, ఒక క్యాండిల్ చుట్టూ ఏడు అడుగులు వేశారు. అంతే కాకుండా ప్రొఫెసర్ నుదిటిపై విద్యార్థి సింధూరం కూడా దిద్దాడు. తామిద్దరూ ఇకపై భార్యాభర్తలుగా ఉంటామని చెబుతూ యూనివర్సిటీ లెటర్ హెడ్‌పై సంతకాలు చేయగా.. వారిద్దరి తరపున ముగ్గురు చొప్పున ఆరుగులు సాక్షి సంతకాలు పెట్టారు. ఇదొక సైకలాజికల్ డ్రామాగా పాయల్ చెబుతుండగా.. అధికారులు మాత్రం సీరియస్ అవుతున్నారు. ఈ వీడియోను కావాలనే కొంత మంది లీక్ చేశారని పాయల్ ఆరోపిస్తున్నారు. అయితే సదరు విద్యార్థి వివరాలు మాత్రం బయటకు రాలేదు.






