- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral Video: బాలిక ప్రాణాలు కాపాడిన పోలీస్ సమయస్పూర్తి.. నగదు బహుమతి ప్రకటించిన డీజీపీ
రైల్వే స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఓ పోలీస్ సమయస్పూర్తి మైనర్ బాలిక ప్రాణాలకు కాపాడింది.

దిశ, వెబ్ డెస్క్: రైల్వే స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఓ పోలీస్ సమయస్పూర్తి మైనర్ బాలిక ప్రాణాలకు కాపాడింది. మధ్య ప్రదేశ్ (Madhya Pradesh) లోని అశోక్ నగర్ రైల్వే స్టేషన్ (Ashok Nagar Railway Station) లో ఓ మైనర్ బాలిక (Minor Girl) ట్రైన్ మిస్ అవుతుందన్న ఆతృతతో వేగంగా కదులుతున్న రైలు వద్దకు పరుగులు తీసింది. అప్పటికే రైలు వేగం పుంజుకోవడంతో ఆ బాలిక రైలు ఎక్కేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే కాలు జారి రైలుకు, రైల్వే ఫ్లాట్ ఫారం కి మధ్యలో పడింది. ఆ బాలికను రైలు ఈడ్చుకెళ్లే క్రమంలో అక్కడికి పరుగున వచ్చిన పోలీస్ జవాన్ (Police Jawan) బాలిక చెయ్యి అందుకున్నాడు.
బాలిక రైలు కింద పడిపోతున్న సమయంలో ప్లాట్ ఫారం మీదికి లాగి ఆమె ప్రాణాలు కాపాడాడు. పోలీస్ జవాన్ కాస్త లేట్ అయినా బాలిక రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయేది. దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ నెట్టంట చక్కర్లు కొడుతోంది. ప్రమాద సమయంలో అప్రమత్తంగా ఉండి సమయ స్పూర్తితో బాలిక ప్రాణాలు కాపాడిన పోలీస్ జవాన్ గోవింద్ సింగ్ (Police Jawan Govind Singh) పై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ విషయం తెలుసుకున్న డీజీపీ కైలాష్ మక్వానా (DGP Kailash Makwana) జీఆర్పీ జవాన్ గోవింద్ సింగ్ కు 10 వేలు నగదు బహుమతి ప్రకటించారు.






