పీవోకేలో చెలరేగిన హింస.. ఆందోళనకారులపై పాక్ ఆర్మీ కాల్పులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-01 11:44:02  IST  )

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ (POK)లోని ముజఫ్ఫరాబాద్‌ (Muzaffarabad)లో మరోసారి హింస చెలరేగింది.

పీవోకేలో చెలరేగిన హింస.. ఆందోళనకారులపై పాక్ ఆర్మీ కాల్పులు
X

దిశ, వెబ్‌డెస్క్: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ (POK)లోని ముజఫ్ఫరాబాద్‌ (Muzaffarabad)లో మరోసారి హింస చెలరేగింది. పాక్‌ ప్రభుత్వం దశాబ్దాలుగా తమను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కుతోందని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 70 సంవత్సరాలకు పైగా పీవోకేలోని ప్రజలకు ప్రాథమిక హక్కులు కల్పించలేదని ఆరోపించారు. POKలో మౌలిక సంస్కరణలు (Structural Reforms) తీసుకురావాలని.. తమ 38 డిమాండ్లను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ‘షటర్-డౌన్.. వీల్-జామ్’ పేరుతో జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JKJAAC) ఈ ఆందోళనలకు పిలుపునిచ్చింది. అదే సమయంలో ప్రత్యర్థి గ్రూపులు ఒకేసారి ప్రదర్శనలు నిర్వహించింది. దీంతో ఇరు పక్షాలు ఎదురుపడగా నీలం బ్రిడ్జ్ సమీపంలో ఒక్కసారిగా హింస చెలరేగింది. ఈ పరిణామంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పాక్ భద్రతా బలగాలు ఆందోళనకారుపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో మొత్తం 8 మంది పౌరులు అక్కడికక్కడే మృతి చెందగా.. 12 మందికి పైగా పోలీసులు కూడా గాయపడ్డారు.

Next Story