- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫోన్ చూడకపోతే ప్రైజ్..! అక్కడి గ్రామస్తుల వినూత్న పోటీ
స్మార్ట్‌ఫోన్ లేకుండా కేవలం ఐదు నిమిషాలు కూడా ఉండలేని ఈ రోజుల్లో అక్కడి గ్రామస్తులు మొబైల్ వ్యసనంపై వినూత్నంగా పోరాడుతున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: స్మార్ట్‌ఫోన్ లేకుండా కేవలం ఐదు నిమిషాలు కూడా ఉండలేని ఈ రోజుల్లో, పంజాబ్‌లోని మోగా జిల్లా గోలియా ఖుర్ద్ గ్రామస్తులు మొబైల్ వ్యసనంపై వినూత్నంగా పోరాడుతున్నారు. చేతిలో ఫోన్ లేకుండా ఎంత ఎక్కువ సమయం కూర్చుంటారో అదే ఈ పోటీ లక్ష్యం. గ్రామస్తులు నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో నియమాలు సులభమే కానీ సవాల్ మాత్రం కఠినమే. ఫోన్ లేకుండా ఒకేచోట కూర్చోవాలి, లేవొద్దు, నిద్ర సైతం పొవొద్దు. అదేపనిగా వాష్‌రూమ్‌కి వెళ్లడానికి కూడా అనుమతి లేదు. కూర్చున్న చోటుకే తిండి, నీళ్లు మాత్రం అందిస్తారు.
ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే.. మొబైల్ వ్యసనాన్ని తగ్గించేందుకు ఏర్పాటు చేసిన పోటీలో పాల్గొనే సమాచారం కూడా వాళ్లు ఫోన్ ద్వారానే తెలుసుకున్నారు. ‘గ్రేట్ సిట్టింగ్ ఛాలెంజ్’గా పేరుతో సోషల్ మీడియా పోస్టు చేయడంతో రాష్ట్రం నలుమూలల నుంచి మొత్తం 55 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు. చిన్నారుల నుంచి యువత, మహిళలు, వృద్ధుల వరకు అందరూ ఆసక్తిగా పోటీల్లో చేరడం విశేషం. ఈ పోటీకి సమయ పరిమితి లేదు. సహనం ఒక్కటే విజేతను నిర్ణయించే ప్రమాణం. విజేతల కోసం ప్రైజ్.. 1వ బహుమతి, సైకిల్ + రూ.4,500, 2వ బహుమతి, రూ.2,500, 3వ బహుమతి రూ.1,500 నగదు ఇవ్వనున్నారు.
ఈ పోటీపై నిర్వాహకులు మాట్లాడుతూ.. ఫోన్‌లకు దూరంగా ఉండమని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ప్రత్యేకమైన పోటీని ప్రారంభించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఫోన్‌కి దూరంగా ఉంటే జీవితం ఎక్కడా ఆగిపోదని, కుటుంబంతో గడిపే సమయం అసలైన ఆనందమని ప్రజలు గ్రహించాలనే మా ప్రయత్నం అని వారు చెప్పారు. ప్రస్తుతం 55 మంది పోటీదారులు ఇంకా బలంగా కూర్చుండగానే ఉండటంతో, ఏమీ చేయకుండా అత్యధిక సమయం కూర్చున్న ఛాంపియన్ ఎవరు అవుతారన్న ఆసక్తితో మొత్తం గ్రామం ఎదురు చూస్తోందని వారు చెప్పుకొచ్చారు.






